Kalki 2898 AD Trailer Update : కల్కి ట్రైలర్ డేట్… ఇదన్నా హైప్ పెంచుతుందా?

Kalki 2898 AD Trailer Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రోమోలు చేయలేని పనిని ఈ ట్రైలర్ అయినా చేస్తుందా? అనే వివరాల్లోకి వెళితే…

ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ఖరీదైన మూవీగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే, దిశా పటాని లాంటి బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లు షురూ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బజ్ ప్రకారం కల్కి 2898 ట్రైలర్ జూన్ 16న లేదా జూన్ 17న రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -

Kalki 2898 AD New Release Date Announced

ట్రైలర్ అయినా హైప్ పెంచుతుందా?

ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోలు సినిమాపై హైప్ ను తగ్గించేసాయి. దీంతో కనీసం ట్రైలర్ అయినా హైప్ పెంచుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన అమితాబ్ అశ్వద్ధామ లుక్ అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. అలాగే ప్రభాస్ లుక్ కూడా ఆకట్టుకుంది. మరి నెక్స్ట్ రాబోయే ట్రైలర్ ఏ లెవెల్ లో బజ్ క్రియేట్ చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. కాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో ట్రైలర్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

బుజ్జి పరిచయం…

ఇక రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ ను అందరికీ పరిచయం చేశారు. ఓ రోబోటిక్ కార్ కి బుజ్జి అని పేరు పెట్టి, అదే సినిమాలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ అని రివిల్ చేశారు. ఇక బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. సినిమాలో కీ రోల్ పోషించే ఈ బుజ్జిని హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్ లో ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో బుజ్జి ఎవరు దగ్గర నుంచి బుజ్జి ప్రత్యేకతలు దాకా ప్రతి విషయం హాట్ టాపిక్ గానే మారింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు ట్రైలర్ పైనే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు