Chiranjeevi kindness : మెగాస్టార్ విత్ గోల్డెన్ హార్ట్ … సినీ జర్నలిస్ట్‌కు పైసా ఖర్చులేకుండా చికిత్స..!

Chiranjeevi kindness.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు మాత్రమే కాదు మంచి మనసుకి కేరాఫ్ అడ్రస్ కూడా.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు అడిగిన వారికి సహాయం చేస్తూ అండదండగా నిలుస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమందికి ఆర్థికంగా సహాయాన్ని చేసిన ఈయన ఆరోగ్యపరంగా కూడా మరిన్ని సహాయాలు చేస్తూనే వస్తున్నారు.. తాను ఎంత సంపాదిస్తున్నారో.. అందులో సగం ఇలా అడిగినవారికి.. కష్టాల్లో ఉన్నవారికి సహాయాన్ని అందిస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు.. ఇదివరకే కోలీవుడ్ నటుడు పొన్నాంబలం కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో చిరంజీవిని సంప్రదిస్తే.. చిరంజీవి మారు మాట్లాడకుండా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈయనకు పూర్తిగా ఉచితంగా చికిత్సను అందించారు.. ప్రస్తుతం ఈయన ఆరోగ్యంగా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇప్పుడు తాజాగా మరొకసారి తన బంగారు మనసును నిరూపించుకున్నారు చిరంజీవి.. ఒక జర్నలిస్టుకి చికిత్స చేయించి మొత్తం ఖర్చును ఈయనే భరించి గొప్ప మనసు చాటారు.. ఈ మేరకు చిరంజీవి మంచి మనసుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక లేఖను విడుదల చేసింది.. మరి ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ లేఖ..

Chiranjeevi kindness : Megastar with golden heart ... treatment for film journalist without spending a penny
Chiranjeevi kindness : Megastar with golden heart … treatment for film journalist without spending a penny

చిరంజీవి గారికి ఇవే మా కృతజ్ఞతలు.. సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు నాలుగు రోజుల క్రితం జనరల్ మెడికల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఇక అప్పుడు ఏం చేయాలో తెలియక ప్రభు గారు సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే స్టార్ హాస్పిటల్ డాక్టర్స్ కి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి..అడ్మిట్ కూడా చేయించారు.. డాక్టర్స్ కి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రభు గారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. డాక్టర్ రమేష్ టీం క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రమే వేసి ప్రాబ్లం క్లియర్ చేశారు.. ఇక ఈరోజు ప్రభు గారు డిశ్చార్జ్ అవుతున్నారు.. ఎన్నోసార్లు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు.. వాళ్ళ యూనియన్ లో చేరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పినా ఆయన వినలేదు.. చాలా కాలంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ లోనే కొనసాగుతూ.. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం బాధాకరమైన విషయం. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. అందుకే ప్రభు తన ప్రాబ్లమ్ ను ముందే టెస్టుల ద్వారా తెలుసుకొని పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు.. మీకు ఇక తిరుగులేదు.. మళ్లీ మీరు యంగ్ అయ్యారు.. వారం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ యంగ్ హీరోలా మాతోనే కొనసాగుతారు.. ఇక ఆసుపత్రిలో ఒక్క పైసా కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపకుండా ఉండలేకపోతున్నాము.. థాంక్యూ మెగాస్టార్ అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక లేఖ ను వదిలింది.. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు చిరంజీవి మంచి మనసుకి ఉప్పొంగిపోతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు