Actress Hema: డ్రగ్స్ విచారణకు..డుమ్మా కొట్టిన హేమ.. ఏం చెప్పిందంటే..?

Actress Hema.. గత కొద్ది రోజుల క్రితం నుంచి బెంగళూరులో జరిగిన రేవు పార్టీ కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటూనే ఉంది.. ఇందులో సెలబ్రిటీలు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నటి హేమా పేరు కూడా ఎక్కువగా వినిపించింది. అయితే ఆమె మొదట్లో ఈ విషయం పై బుకాయించినప్పటికీ చివరికి అధికారులు సైతం ఆమెను గుర్తించి బ్లడ్ శాంపుల్ తీయగా.. అందులో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా బయటపడింది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తాజాగా సీసీబీ విచారణకు ఈరోజు 86 మందితో సహా నటి హేమా కూడా హాజరు కావలసి ఉన్నది.

విచారణకు రాలేనంటూ లేఖ..

Actress Hema: What did the dumbfounded Hema say to the drug investigation?
Actress Hema: What did the dumbfounded Hema say to the drug investigation?

కానీ నటి హేమా అందుకు డుమ్మా కొట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాను వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నానని.. అందుకే విచారణకు రాలేనంటూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను గడువు కోరుతూ.. ఒక లేఖను కూడా రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న సిసిబి హేమాకు మరొకసారి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీలో దాదాపుగా 103 మంది పాల్గొనగా.. ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో అధికారులు గుర్తించారు.

ఒరిజినల్ పేరుతో పార్టీకి ఎంట్రీ..

ఇందులో నటి హేమా కూడా ఉన్నదని తెలియడంతో ఈమెతో పాటు మొత్తం మీద 8 మంది అక్కడ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తాను రాలేనని హేమ తెలియజేసింది. ఈ రేవ్ పార్టీ వ్యవహారంలో హేమా మొదట ఉందని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ ఆమె మాత్రం ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ కొన్ని వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే చివరికి ఎట్టకేలకు హేమా బండారం మొత్తం బయటపడింది. అంతేకాకుండా హేమ పేరుకు బదులుగా కృష్ణవేణి అని తన ఒరిజినల్ పేరుతో ఆ పార్టీకి వెళ్లినట్లు సమాచారం.

- Advertisement -

పోలీసులపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్న హేమ..

అయితే హేమా తన పేరు మాత్రం ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చివరికి మాత్రం ఆమె గుట్టు రట్టు అయింది. అంతేకాకుండా గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వంటకు సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. వీటి పైన కూడా హేమాను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సీసీబీకి హేమ రాలేనంటూ లేఖ రాయడంతో ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ లో ఈమె గురించి చర్చ నడుస్తోంది. కానీ చివరికి హేమ మాత్రం తాను వెళ్లలేక పోయినా.. తన పేరు బయటపెట్టి తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని.. బెంగళూరు పోలీసుల పైన లీగల్ ఫైట్ చేస్తానంటూ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

హేమా పై సెలబ్రిటీల ఆరోపణ..

మొత్తానికైతే ఈమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పటికీ ఇలా ఏదో ఒక నాటకం ఆడి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తోంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈమెపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అందులో తమన్నా సింహాద్రితో పాటు కరాటే కళ్యాణి కూడా ఈమె గురించి అసలు నిజాలు బయటపెట్టారు.మరి ఇప్పుడు అన్ని విషయాలు ఈమె మెడకు చుట్టుకున్నాయి.. వీటి నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు