Vadakkan : తమిళ సినిమాకు టైటిల్ ట్రబుల్స్… పేరు మారిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామంటున్న సెన్సార్ టీం

Vadakkan : భాస్కర్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన వడక్కన్ సినిమాకు టైటిల్‌ కష్టాలు మొదలయ్యాయి. టైటిల్ మారిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ టీం పెట్టిన కండిషన్ కారణంగా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. మరి టైటిల్ లో అంతగా ఏముంది? అంటే..

సెన్సార్ కష్టాలు

మే 24న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కావలసిన ద్విభాషా సౌత్ చిత్రం వడక్కన్ టైటిల్ విషయంలో ఇబ్బందుల్లో పడింది. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన భాస్కర్ శక్తి ఫస్ట్ మూవీ వడక్కన్. షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు అప్లై చేసుకున్న ఈ మూవీకి టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డ్ కోరింది. తమిళనాడుకు ఉపాధి కోసం వలస వచ్చే కొంతమంది కార్మికుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ విషయంలో సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

సమస్య ఏంటంటే?

రీసెంట్ గా సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు టీం టైటిల్ మారిస్తే గానీ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేదీ లేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే నార్త్ వాళ్ళను కించపరిచేలా ఈ మూవీ టైటిల్ ఉందని అంటున్నారు. కానీ సెన్సార్ సభ్యుల నిర్ణయానికి ఒప్పుకోని చిత్రబృందం అప్పీల్ చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Vadakkan: టైటిల్‌ మారిస్తేనే సర్టిఫికెట్‌.. ఆ సినిమాకు సెన్సార్ షాక్ | Censor Board recommends title change for Bhaskar Sakthi Vadakkan Movie ktr

డైరెక్టర్ ఏమంటున్నారంటే?

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తి టైటిల్ సమస్య వెనుక ఉన్న కారణాల గురించి మాట్లాడారు. వడక్కన్ అనే పదానికి అర్థాలు వేర్వేరుగా ఉన్నాయని సెన్సార్ బోర్డు తనకు వివరించిందని శక్తి అన్నారు. సౌత్‌లో సెన్సార్ బోర్డ్ ప్రకారం దీనికి అభ్యంతరకరమైన అర్థం ఉంది. అందుకే టైటిల్ సెన్సార్ చేయవలసి వచ్చింది అని అన్నారాయన. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను మార్చాలని నిర్ణయించుకున్నారు. రైల్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. వడక్కన్ కొత్త టైటిల్, విడుదల తేదీని రెండు రోజుల్లో ప్రకటిస్తుంది చిత్రబృందం. ఈ మార్పు ఈ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

మూవీ వాయిదా

డైలాగ్ రైటర్ శక్తి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న రచయితలలో ఒకరు. వెన్నిల కబడ్డీ కుజు, నాన్ మహాన్ అల్లా వంటి హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. డైలాగ్ రైటర్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శక్తి ఇప్పుడు వడక్కన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి డైరెక్షన్‌లోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రం గురువారం 2023 ఫిబ్రవరి 23, 2023న సెట్స్‌పైకి వెళ్లింది. మే 24న రిలీజ్ కావలసి ఉండగా, టైటిల్ సమస్య కారణంగా వాయిదా పడింది.

డిస్కవరీ సినిమాస్ బ్యానర్‌పై వేడియప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనిని సినిమా ప్యాలెస్ సమర్పిస్తుంది. ఈ చిత్రంలో కుంగుమ రాజ్‌ కథానాయకుడిగా, వైరమలా కథానాయికగా నటించింది. కర్నాటక సంగీత దర్శకుడు ఎస్‌జె జనని ఈ మూవీకి సంగీతాన్ని అందించనుండగా, రమేష్ వైద్య పాటలను కంపోజ్ చేస్తున్నారు. వలస కార్మికుల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ఇప్పుడు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు