Anasuya: కొత్త బిజినెస్ చేయనున్న యాంకర్ అనసూయ ?

Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరపై తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది. జబర్దస్త్ షోలో కొన్నేళ్లపాటు యాంకర్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే సినిమాల్లో అవకాశాలను కొట్టేసింది.

తన అద్భుతమైన నటనతో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న అనసూయ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వెకేషన్ కి వెలుతు తన భర్త, పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటుంది.

Anasuya, the bold beauty who is shaking with anger
Anchor Anasuya will start a new business

అంతేకాకుండా అనసూయ వరుస ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ అలరిస్తూ ఉంటుంది అనసూయ. ఇదిలా ఉండగా…. ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ ప్రస్తుతం ఓ బిజినెస్ ప్రారంభించబోతుందట.

- Advertisement -

ఆ బిజినెస్ ని ఇక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబోతుందట. ఆ బిజినెస్ తాను ఒంటరిగా కాకుండా తన భర్తతో కలిసి ప్రారంభించనుందట. తాను ప్రారంభించే బిజినెస్ ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు