Bujji From Kalki : బుజ్జిని కాపీ కొట్టారా… ఏది ఒరిజినల్ ? ఏది డుబ్లికెట్ ?

Bujji From Kalki : సినిమా కోసం పాత్రలను క్రియేట్ చేశారు. కానీ, కల్కీ కోసం నాగ్ అశ్విన్ ఏకంగా ఓ భారీ కారునే క్రేయేట్ చేశాడు. 6 టన్నుల బరువుతో క్రియేట్ చేసిన ఆ కారుకు బుజ్జి అనే పేరు పెట్టారు. అంతే కాకుండా, సినిమాలో ఆ కారు మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేసి, స్టార్ హీరోయిన్స్ తో డబ్బింగ్ కూడా చెప్పించారు. తెలుగులో బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పగా, హిందీలో శ్రద్ద కపూర్ డబ్బింగ్ చెప్పింది. మిగితా భాషల్లో కూడా బుజ్జికి హీరోయిన్స్ తో డబ్బింగ్ చెప్పించబోతున్నారు.

ఇందతా పక్కన పెడితే, ఒక సినిమా కోసం ఓ భారీ కారును తయారు చేయడం అనేది పెద్ద విషయమే. అందులోనూ ఇప్పటి వరకు అలాంటి వెహికిల్‌ను చూడలేదు. ఇంజనీరింగ్‌లో అన్ని రూల్స్ బ్రేక్ చేసేలా ఈ కారు ఉంది అంటూ బడా బడా ఆటో మొబైల్ ఇంజనీర్లు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Did Kalki 2998 Ad Movie Copy Bujji Car..?
kalki 2998 Ad Bujji Car..?

ఈ వీడియో ఓ కారు ఉంది. అది ఎలా ఉందంటే… అచ్చం బుజ్జిలానే ఉంది. బుజ్జి అంటే కల్కి లో ఉన్న బుజ్జి కారు. ఈ బుజ్జి ని చూసి ఈ వీడియోలో ఉన్న కారును కాపీ కొట్టారా..? లేదా ఈ వీడియోలో ఉన్న కారును చూసి బుజ్జి ఆలోచన వచ్చిందా..? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తుంది.

- Advertisement -

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారు కెనాడో ఉందని తెలుస్తుంది. దీనికి కూడా మూడు చక్రాలు ఉన్నాయి. కానీ, బుజ్జి చక్రాలు కాస్త పెద్ద సైజ్ లో ఉంటే, ఈ కారుకు మాత్రం చిన్న సైజ్ లో చక్రాలు ఉన్నాయి. చూసిన ఉంటేనే ఈ రెండు కార్లను ఒక్కరే తయారు చేశారు అనే ఫీలింగ్ రాకుండా ఉండదు. మరీ దీనిలో ఒరిజినల్ ఏదో…? డుబ్లికెట్ ఏదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు