Sara Tendulkhar: బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సారా టెండూల్కర్ ?

Sara Tendulkhar : టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో పరుగులు చేసి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం టీమిండియాకు రిటైర్మెంట్ తీసుకొని తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సచిన్. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సచిన్ పలు యాడ్ షోలలో నటిస్తూ కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే క్రికెట్ లోకి అడుగుపెట్టిన అర్జున్ ముంబై ఇండియన్స్ టీమ్ కు ఆడుతున్నాడు.

సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సారా హీరోయిన్ కి మించిన అందంతో ఉంటుంది. సచిన్ కూతురుగా సారాకి సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫాలోయింగ్ ఉంది. సారా టెండూల్కర్ ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకి వేలాది సంఖ్యలో లైక్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చినప్పటికీ సారా ఇప్పటివరకు ఎలాంటి సినిమాల్లో నటించలేదు.

- Advertisement -

ప్రస్తుతం సారా స్టార్ హీరో సినిమాలో కీలకపాత్ర పోషించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా…. సారా టెండూల్కర్ టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో ప్రేమాయణం నడిపిస్తోందని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వారిద్దరూ ఇప్పటివరకు నోరు విప్పలేదు. కానీ తరచుగా వీరిద్దరూ బయట కలుసుకున్నప్పటి ఫోటోలు, వీడియోలు చాలా సార్లు లీక్ అయ్యాయి. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు ఉందో తెలియదు కానీ వీరిద్దరూ నిజంగా వివాహం చేసుకుంటే బాగుంటుందని సారా అభిమానులు….అటు గిల్ అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు