Sandeep Kishan : “మైఖేల్” మూవీ డిజాస్టర్ కు కారణం ఎవరు?

Sandeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ “మైఖేల్” బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవకోన” ప్రమోషన్స్ లో “మైఖేల్” మూవీ ప్లాప్ అవ్వడానికి గల కారణం ఏంటో సందీప్ బయట పెట్టారు. తన మూవీ డిజాస్టర్ కావడం గురించి సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ “మైకేల్” మూవీ డిజాస్టర్ కావడానికి కారణం ఎవరు? సందీప్ ఎవరిని టార్గెట్ చేశాడు? అంటే…

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దైవభక్తి, క్షుద్ర శక్తి, కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే హీరో సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా మూవీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా మూవీ “మైకేల్” 2023 ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మంచి హైప్ తో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా దారుణంగా ప్లాప్ అయ్యింది. అయితే ఈ విషయం తనకు ముందే తెలుసు అని తాజాగా “ఊరు పేరు భైరవకోన” మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

సందీప్ కిషన్ “మైకేల్” డిజాస్టర్ కావడం గురించి మాట్లాడుతూ ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదనీ, తనకే నచ్చలేదని, అదే విషయాన్ని డైరెక్టర్ తో కూడా చెప్పినట్టుగా వెల్లడించారు. తమ దగ్గర “మైఖేల్ “కు సంబంధించి మంచి ఫుటేజ్ ఉందని, ఆ ఫుటేజ్ పరంగా సినిమా అద్భుతంగా ఉండేదని, కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఏదో తప్పు జరిగిందని సందీప్ కిషన్ వెల్లడించారు. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరించగా, అందులో ఒకరికి ముందే ఈ విషయాన్ని చెప్పానని అన్నారు సందీప్ కిషన్.

- Advertisement -

ఇద్దరు ప్రొడ్యూసర్లు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారని, కానీ ఒక్క ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమా బాగా రాలేదని రిలీజ్ కు 12 రోజుల ముందే తనతో చెప్పిన విషయాన్ని సందీప్ కిషన్ బయటపెట్టారు. అయితే రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో తాను సరిగ్గా చూడలేకపోయానని, విడుదల కావడానికి ఒక రోజు ముందు మూవీని చూడగా, తనకు కూడా బాగాలేదనిపించిందని చెప్పుకొచ్చాడు సందీప్. సాంకేతికంగా “మైకేల్” అద్భుతమైన స్టోరీ అని, కానీ తాము చెప్పాలనుకున్న స్టోరీని సరిగ్గా చెప్పలేకపోవడంతో మూవీ ఫలితం ఏంటో తనకు ముందుగానే తెలిసిపోయిందని సందీప్ కిషన్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా చూస్తుంటే ఈ హీరో “మైకేల్” డిజాస్టర్ కు ఇద్దరు నిర్మాతలను బాధ్యుల్ని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు