SSMB 29 : రాజమౌళి కథను ఎక్కడ నుంచి కొట్టేశారో పట్టేసిన నెటిజన్లు

SSMB 29

సోషల్ మీడియా పరిధి పెరగడం అనేది మేకర్స్ కు కొత్త తలనొప్పిగా మారింది. సినిమా పోస్టర్ మొదలుకొని మ్యూజిక్, లిరిక్స్, సాంగ్స్, కంటెంట్ ఇలా దేన్నీ వదలకుండా భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు నెటిజెన్లు. పొరపాటున ఎక్కడైనా అది మ్యాచ్ అయ్యిందంటే కాపీ కంటెంట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. త్రివిక్రమ్, కొరటాల నుంచి రాజమౌళి దాకా చాలామంది టాలీవుడ్ డైరెక్టర్స్ కాపీ కంటెంట్ పై విమర్శలు ఎదుర్కొన్న వారే. రీసెంట్ గా రిలీజ్ అయిన “గుంటూరు కారం” మూవీ విషయంలో ఇలాగే జరిగింది. తాజాగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ SSMB 29 కూడా కాపీనే అంటున్నారు. సినిమా స్టార్ట్ కూడా కాకముందే జక్కన్న ఆ స్టోరీని ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో సోషల్ మీడియాలో బయట పెడుతున్నారు. మరి ఇంతకీ రాజమౌళి మహేష్ బాబు కోసం ఆ స్టోరీని ఎక్కడి నుంచి లేపేశారు? అంటే…

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ యాక్షన్ అడ్వెంచర్ రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టును SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ కథను అందించబోతున్నారు. ఎప్పటిలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో అడవుల్లో జరిగే అక్రమాలపై పోరాడే వ్యక్తిగా మహేష్ బాబు కొత్త పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలోనే జర్మనీకి వెళ్ళొచ్చిన మహేష్ బాబు అక్కడ వారం పాటు టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో SSMB 29 స్టోరీ కాపీ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

SSMB 29 మూవీ “ఇండియానా జోన్స్” హాలీవుడ్ మూవీ ఆధారంగా రూపొందుతోందని చెబుతున్నప్పటికీ, తాజా రూమర్స్ ప్రకారం ఓ కొరియన్ సినిమా కాపీ అని అంటున్నారు. ఇంకా రాజమౌళి సినిమాను కూడా స్టార్ట్ చేయకముందే వీళ్లకు స్టొరీ గురించి ఎలా తెలిసిపోయిందో మరి. అప్పుడే కొరియన్ మూవీ నుంచి స్టోరీని లేపేసాడు రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేశారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కన పెడితే అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో రూపొందించబోతున్న SSMB29 మూవీలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే లేదా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నట్టు చెబుతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందబోతున్న ఈ మూవీనీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక ప్రామాణాలతో, అత్యంత భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు