Preeti Vijay Kumar: సినిమాలు లేవు..కానీ సంపాదన మాత్రం కోట్లల్లో..ఎలా?

Preeti Vijay Kumar

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ వారసురాలిగా ప్రీతీ విజయ్ కుమార్ ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు సినిమాలకు దూరం అయింది. అయితే ఈమె గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీతి.. సినీ కుటుంబానికి చెందిన ఈమె 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. ఆ తర్వాత తెలుగు, మలయాళం భాషల్లో కూడా నటించిన ప్రీతి.. నరసింహ చిత్రంతో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది.

ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, చందు, ప్రియమైన నీకు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె.. ఆ తర్వాత 2002లో దర్శకుడు హరి ని వివాహం చేసుకొని నటనకు స్వస్తి చెప్పి.. వైవాహిక జీవితానికి పరిమితమైంది.. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.. ఇకపోతే ప్రీతీ విజయ్ కుమార్ నటనకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె తన సోదరి శ్రీదేవి అలాగే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక అంతేకాదు మరొకవైపు వ్యాపారంలో కూడా బిజీగా ఉంటున్న ఈమె భారీగా ఆస్తులు సంపాదించినట్లు సమాచారం.. చెన్నై సముద్ర తీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీతీ ప్యాలెస్ అనే పేరుతో ఒక అందమైన కళ్యాణ మండపాన్ని నిర్మించింది ప్రీతీ విజయ్ కుమార్.. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ను కూడా ఏర్పాటు చేసింది.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పని చేయడం విశేషం.. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు కూడా ఇవ్వడం జరిగింది..

- Advertisement -

వీటితోపాటు స్థానిక సాలిగ్రామంలో సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియో ని కూడా నిర్వహిస్తున్నారు ప్రీతీ విజయ్ కుమార్.. ఇలా నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోంది.. మరొకపక్క ఈమె భర్త హరి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక మొత్తానికి సినిమాలలో నటించకపోయినా సరే ఇలా వీటి ద్వారా భారీ పాపులారిటీతో పాటు అంతకుమించి సంపాదన పొందుతోంది ప్రీతీ విజయ్ కుమార్. ఇకపోతే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు