Sundeep Kishan: మళ్ళీ ఫిబ్రవరి లో వస్తున్నాడు.. ఈసారైనా కలిసొస్తుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ ఆక్టర్ లలో ఒకడు ‘సందీప్ కిషన్’. ఇండస్ట్రీ లో చాలా కాలం నుండి కొనసాగుతున్నా ఇప్పటివరకు సరైన బెంచ్ మార్క్ సినిమా రాలేదు. పదేళ్ల కింద వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మినహా ఇప్పటివరకు మరో హిట్ లేదు ఇతగాడికి. కొన్ని సార్లు మూవీస్ బాగానే చేసినా, ఆ సినిమాలకు ప్రమోషన్ల లోపమో లేక, రిలీజ్ అయిన టైమింగ్ రాంగో తెలీదు గాని ప్లాప్ అయ్యాయి. అయినా హిట్టు కోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక లేటెస్ట్ గా ‘ఊరు పేరు భైరవకోన’ అంటూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో వస్తున్నాడు.

“డిస్కో రాజా” ఫేమ్ VI ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా లాస్ ఇయర్ ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పెద్ద సినిమాల పోటీవల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఫిబ్రవరి రిలీజ్ మంత్ మాత్రం సందీప్ కిషన్ కి అస్సలు కలిసిరాలేదు.

గతంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మనసుకు నచ్చింది’ మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యి డిజాస్టర్ ఇవ్వగా, లాస్ట్ ఇయర్ లో ఎన్నో ఆశలతో మైఖేల్ సినిమా కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు మూడో సారి అదే నెలలో సందీప్ కిషన్ సినిమా వస్తుండడం తో ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఊరు పేరు భైరవ కోన సినిమా నుండి వచ్చిన స్టిల్స్ గాని, టీజర్ గాని అంత కొత్తగా ఏమి లేవు. పైగా ఈ మూవీ పై ఇంతవరకు సరైన బజ్ క్రియేట్ కాలేదు. అందువల్ల ఈ సినిమాతో మళ్ళీ సందీప్ కి హిట్ వస్తుందా లేదా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ రావడం లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు