2024 First week Ott Movies : కొత్త ఏడాది ఓటిటిలో కొత్త సినిమాల సందడి

2024 First week Ott Movies : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న న్యూ ఇయర్ ఎట్టకేలకు వచ్చేసింది. కొత్త ఏడాది కొత్తగా ఉండాలని ఆశిస్తూ అందరూ తమ రొటీన్ లైఫ్ లో పడడానికి రెడీ అయిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే… న్యూ ఇయర్ సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలేవి థియేటర్లలో రిలీజ్ కాలేదు. న్యూ ఇయర్ కానుకగా ఈ వీకెండ్ కేవలం రెండు సినిమాలు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. ఇక థియేటర్ల సంగతి ఎలా ఉన్నా ఓటేటిలో మాత్రం తెలుగుతోపాటు ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు ఇంట్లోనే ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.

న్యూ ఇయర్ సందర్భంగా సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న “సర్కారు నౌకరి” మూవీ రిలీజ్ అయ్యింది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో భావన హీరోయిన్ గా పరిచయం అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించడం విశేషం. కండోమ్స్ గురించి అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగిగా ఆకాష్ ఈ సినిమాలో నటించాడు. ఆకాష్ మూవీ సంగతి ఇలా ఉంటే… డిసెంబర్ 5న శివ కంఠమనేని హీరోగా నటించిన “రాఘవరెడ్డి” అనే మూవీ రిలీజ్ కాబోతోంది.

అసలు ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఓటిటి విషయానికి వస్తే… “హాయ్ నాన్న” మూవీ ఓటిటి ఎంట్రీ గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న విడుదలైంది. నేచురల్ స్టార్ నాని, మృణాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రిలీజ్ అయి నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా థియేటర్ల వద్ద సందడి నడుస్తోంది.

- Advertisement -

ఎట్టకేలకు జనవరి 4న నెట్ ఫ్లిక్స్ లో “హాయ్ నాన్న” మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా బిట్ కాన్డ్, గుడ్ గ్రీఫ్, అనే హాలీవుడ్ మూవీస్, “కంజురింగ్ కన్నప్పన్” అనే తమిళ మూవీ జనవరి 5న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. వీటితోపాటు ది బ్రదర్స్ సన్, ఫూల్ మీ వన్స్ అనే రెండు సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ లో ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో “మ్యారీ మై హస్బెండ్” అనే ఒక కొరియన్ మూవీ న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో “తేజస్”, సోనీ లివ్ లో “క్యూబికల్స్”, బిగ్ బాస్ సేమ్ శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న “#90s” అనే తెలుగు వెబ్ సిరీస్ ఈటీవీ విన్ జనవరి 5న న్యూ ఇయర్ ఫస్ట్ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. జియో సినిమాలో “మెగ్ 2 – ది ట్రెంచ్” అనే హాలీవుడ్ మూవీ జనవరి 3న అందుబాటులోకి రానుంది..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు