New Year 2024: ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పాటించడం మిస్ చేయొద్దని అనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

New Year 2024: గత కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న కొత్త ఏడాది వచ్చేసింది. 2023 కు గుడ్ బై చెప్పేసి 2024లో అడుగు పెట్టేసాం. మరి న్యూ ఇయర్ అనగానే క్యాలెండర్ మార్చేస్తే సరిపోతుందా? లేదు మనలో, మనం ఆలోచించే విధానంలోనూ ఖచ్చితంగా ఏదో ఒక మార్పు రావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో భాగంగానే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో తమ జీవితాన్ని మార్చే కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అయితే అందరూ వాటిని పాటిస్తారని చెప్పలేం గానీ కొంతమంది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. మరి ఈ ఏడాది మీ రిజల్యూషన్స్ ఏంటి? మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఏడాది మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసమే.

1. రిలేషన్స్

Relations
రిలేషన్ ఏదైనా సరే బౌండరీలు పెట్టుకుంటే ఆ తర్వాత మీరు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. ఎవరైనా ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చినా, వెళ్లినా ఈ బౌండరీలు ఉంటే ఎమోషనల్ గాను, మెంటల్ గాను వాళ్ళతో సంబంధం లేకుండా మీకు మీరే స్ట్రాంగ్ గా ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి రిలేషన్ అయినప్పటికీ పర్సనల్ స్పేస్ చాలా అవసరం. కాబట్టి కాస్త సెన్సబుల్ గా ఉంటూనే రిలేషన్ లో బౌండరీలు పెట్టుకుని లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

- Advertisement -

2. వ్యాయామం

exercise
చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్ లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో వ్యాయామం ఒకటి. జిమ్ లో అయితే కండలు పెంచి హీరోలా కనిపించవచ్చు అన్న ఆలోచనతో చాలామంది జనవరి ఒకటో తేదీన జిమ్ లకు క్యూ కడతారు. ఫీజు కూడా కట్టేస్తారు. కానీ ఆ తర్వాత మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డబ్బు నష్టపోవడం తప్ప వేరే ఉపయోగం ఉండదు. ఒకవేళ మీరు నిజంగా హెల్దిగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఉండి కూడా తేలికపాటి వ్యాయామాలు చేస్తూ కూడా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఫిట్ గా మారవచ్చు.

3. ఆరోగ్యం

health
ఆరోగ్యం అనేది మనకు అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంతైనా సంపాదించగలం. కావాల్సింది తినగలం. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? ఎంతసేపు నిద్రపోతున్నారు? ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి వ్యాయామాలు చేస్తున్నారు అనే విషయాలపై దృష్టి పెట్టండి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.

4. వాయిదా

postpone
రేపు చేయాలనుకున్న పనిని ఈరోజే చెయ్. ఈరోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చెయ్ అనే మాటను మనం వింటూనే ఉంటాం. కానీ చాలామంది తాను చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తూ వస్తుంటారు. పైగా వాటికి అనవసరమైన సాకులు వెతుకుతూ ఉంటారు. కానీ వీటి వల్ల సమయం వృధా అవ్వడంతో పాటు ఆపేసిన పనులన్నీ ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు పూర్తి చేయాల్సిన పనులను అప్పుడే కంప్లీట్ చేయండి. అలాగే పని చేస్తున్న సమయంలో కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉండండి.

5. క్షమించడం

forgive
ఇక గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో తప్పు చేస్తారు. కాబట్టి మీ వల్ల జరిగిన తప్పుకు అపరాధ భావంతో కుమిలిపోకుండా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఒకవేళ సారీ చెప్పగలిగితే హృదయ పూర్వకంగా చెప్పేయండి. అవతలి వారు క్షమిస్తారా లేదా అన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టం. కాబట్టి ఆ తప్పును వదిలేసి జీవితంలో ముందుకు సాగండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు