RGV : “వ్యూహ” రచనలో వర్మ “శపథం”..

Shapatham

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత తన ఫేడవుట్ అయిపోయాడు. కానీ గత పదేళ్లుగా రాజకీయాల నేపథ్యంలో సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. ఒకప్పుడు కొందరు రాజకీయ నాయకుల మీదే సినిమాలు తీసిన ఈ సంచలన దర్శకుడు ఇప్పుడు ఏకంగా పలు, పార్టీల నేతల మీదే సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు. ముఖ్యంగా టీడీపీ పార్టీ ని ఆ పార్టీ నేత చంద్రబాబును తన డైలాగులతో వేసుకున్న ఆర్జీవీ, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల సమయం రావడంతో, జగన్ పార్టీకి సపోర్ట్ గా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తున్నాడు.

ఇప్పటికే “వ్యూహం” సినిమాతో ఆల్రెడీ సినిమా కూడా తీసేయగా, ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. వ్యూహం ట్రైలర్ లో చంద్రబాబు తో పాటు, టాలీవుడ్ మెగా కాంపౌండ్ ని గట్టిగా టార్గెట్ చేసిన వర్మ, ఈ సారి మరింత వేడి పుట్టిస్తున్నాడు. వ్యూహం సినిమాకి రెండో పార్ట్ గా శపథం సినిమా తీస్తానని ఎప్పుడో అనౌన్స్ చేసిన ఆర్జీవి లేటెస్ట్ గా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేసాడు. ఇక ఆర్జీవీ వ్యూహ రచనలో భాగంగా తీసిన శపథం లో ప్రెజెంట్ అధికారంలో ఉన్న జగన్ గవర్నమెంట్ ని పడగొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు చూపించగా ఆ వ్యూహానికి పవన్ ని వాడుకుంటున్నట్టు ట్రైలర్ లో చూపించాడు.

- Advertisement -

అయితే ఏ విషయంలో నైనా లీగల్ గా వెళ్లే వర్మ ఈ సారి మెగా ఫ్యామిలీని పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. రాజకీయాల్లో చిరు లేకపోయినా ఇలా ఇరికించడం కరెక్ట్ కాదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే వర్మ ఇలాంటివి పట్టించుకోడని తెలిసిందే. ఏది ఏమైనా ఈ ట్రైలర్ ద్వారా మరింత వేడిని పుట్టించగా, వ్యూహం సినిమాని ఫిబ్రవరి 23న శపథం సినిమాని మార్చ్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ట్రైలర్ లో చెప్పేసాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా రిలీజ్ కి దాదాపు అడ్డంకి వస్తుంది. మరి ఈసారి ఎన్నికలకు ఫలితాలకు ఈ సినిమాలు ఎంత వరకు కారణం అవుతాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు