Gaami : అక్కడ అల్రెడీ రచ్చ షురూ!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ క్రేజీ మూవీ “గామి” ఫైనల్ గా మహా శివరాత్రి సందర్బంగా రిలీజ్ అయిపోతుంది. విద్యాధర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాను కార్తీక్ శబరీష్ నిర్మించాడు. ఇక “గామీ” చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర శంకర్ గా నటించగా, చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా జాహ్నవి అనే పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తోనే అంచనాలు భారీగా పెంచేయగా, ఫైనల్ గా పోటీలో కూడా ఈ సినిమాకే ఎక్కువ ప్రేక్షకాదరణ ఎక్కువ లభించేటట్టు ఉంది. ఇక విశ్వక్ సేన్ చేస్తున్న లేటెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన గామి ఆడియన్స్ ముందుకు ఒక ఫిక్షనల్ మైథలాజి టచ్ తో వస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపించిన గామి సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

ఆల్రెడీ రచ్చ షురూ..

గామి సినిమా మహాశివరాత్రికి రిలీజ్ అవుతుండగా, హైదరాబాద్ లో అక్కడక్కడా ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడిన సంగతి తెలిసిందే. అయితే గామి సినిమా ఆల్రెడీ ఓవర్సీస్ లో రచ్చ మొదలుపెట్టేయడం విశేషం. రెండు రోజుల వరకు ముందు వరకూ కూడా అక్కడ అంతంత మాత్రంగానే ఉన్న ఈ సినిమా బుకింగ్స్ ఏకంగా అమెరికాలో ప్రీ సేల్స్ ఆల్రెడీ 100k డాలర్లని దాటేసిందని సమాచారం. అంటే లక్ష డాలర్లన్నమాట. ఇక ప్రీమియర్స్ తో కలిపి ఒక్క ఓవర్సీస్ లోనే గామి 2 లక్షల డాలర్లు కొల్లగొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోనూ గామి జోరు..

మహా శివరాత్రి రోజున గామి తో పాటే భీమా, ప్రేమలు రిలీజ్ అవుతున్నా, ఆన్లైన్ బుకింగ్స్ పరంగా మాత్రం గామి సినిమాకే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సులలో బుకింగ్స్ మంచి జోరునే చూపిస్తూ ఉన్నాయి. మాస్ సెంటర్స్ లో పెద్దగా బుకింగ్స్ లేవు కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే అవలీలగా సాలిడ్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకునే అవాకాశం ఉంటుందని చెప్పాలి. ఇక ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 1.5 నుండి 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మహాశివరాత్రి అడ్వాంటేజ్ ఉండడం వల్ల పైగా ఈ సినిమాలో శివుడి రిఫరెన్స్ ఉండడం వల్ల ఆడియన్స్ గామి సినిమాకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా అంచనాలను సరిగ్గా అందుకుంటుందా, ఒకవేళ అన్నీ కుదిరి మించిపోతుందా లేదా అన్నది చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు