Dil Raju : టైటిల్ కన్ఫర్మ్ చేసేసాడు

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో స్ట్రాంగ్ అండ్ టాప్ పొజిషన్లో ఉన్నారు దిల్ రాజు. దిల్ రాజు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. అయితే దిల్ అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు ఇప్పటివరకు 50 పైగా సినిమాలు పూర్తి చేశాడు దిల్ రాజు.

అలానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి అనుబంధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని మరో బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశాడు దిల్ రాజు. అయితే ఈ బ్యానర్ లో మొదట వచ్చిన సినిమా బలగం. బలగం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాని వేణు తెరకెక్కించిన విధానం చాలామంది హృదయానికి హత్తుకుంది అని చెప్పొచ్చు. చాలా రోజులు తర్వాత ఆ సినిమాను ఊర్లలో తెర బొమ్మలేసుకుని మరి చూశారు అంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.

అయితే దర్శకుడు వేణు గురించి మాట్లాడుకుంటే ముందుగా మేకప్ ఆర్టిస్ట్ గా చిత్రం శ్రీను దగ్గర తన కెరీర్ ను మొదలు పెట్టాడు వేణు. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో పాత్రలు వేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. అయితే ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ షో వేణు కి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. అయితే ఒక స్కిట్ కూడా సంచలనానికి దారితీసి వివాదాలను క్రియేట్ చేసింది. ఆ కొన్నిరోజులు తర్వాత జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు వేణు

- Advertisement -

జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన వేణు, తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఆ తర్వాత తన డ్రీమ్ అయిన డైరెక్షన్ పైన కంప్లీట్ గా ఫోకస్ చేశాడు వేణు. ప్రియదర్శి ను హీరోగా పెట్టి బలగం అనే సినిమాను తెరకెక్కించి అద్భుతమైన హిట్ ను సాధించాడు. దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే వేణు ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో సినిమాను చేసే అవకాశం పొందాడు.

నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని ఎంచుకున్న సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటున్నాయి. అటువంటి నానిని తన స్క్రిప్ట్ తో ఒప్పించాడు అంటే మామూలు విషయం కాదు. అయితే నానితో చేస్తున్న సినిమాకి ఎల్లమ్మ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి అయితే ఇదే టైటిల్ ను అఫీషియల్ గా ఈరోజు అనౌన్స్ చేశాడు దిల్ రాజు.

కథలంటే ఊహల్లోంచి పుట్టినవే కాదు జీవితాల్లో నుంచి పుట్టినవి కూడా అని కొంతమంది దర్శకులు మాత్రమే నమ్ముతారు. అలా నమ్మిన దర్శకులలో వేణు ఒకరిని చెప్పొచ్చు. ఎందుకంటే బలగం అనే కథ కూడా జీవితంలో నుంచి పుట్టింది. ఇప్పుడు ఎల్లమ్మ అన్న టైటిల్ విన్నప్పుడు కూడా ఇది కూడా ఒక మనిషికి హత్తుకునే కథ అని తెలుస్తుంది. అయితే నాని లాంటి హీరోకి ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చాలామంది ఆలోచన. ఏదేమైనా టైటిల్ కథకి కనెక్ట్ అయితే చాలు అనేది ఇంకొంతమంది అభిప్రాయం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు