Sreeleela: శ్రీలీల చేస్తున్న పని కరెక్టేనా.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లలో శ్రీ లీల కూడా ఒకరు.. కేవలం మూడేళ్లలోనే దాదాపుగా పదికి పైగా సినిమాలలో అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. మొదట పెళ్లి సందD అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన డాన్స్ తో.. అందంతో అందరినీ ఆకట్టుకుంది.. డాన్స్ విషయంలో తన ఎనర్జీ తో ఏ మాత్రం హీరోలకు తీసిపోకుండా మ్యాచ్ చేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఎలాంటి హీరోలైనా సరే తాట ఊడిపోయేలా డాన్స్ చేస్తుందంటూ ఇటీవలే మహేష్ బాబు కూడా ఈమెను పొగిడేశారు.

శ్రీ లీల చిత్రాలు..
ఇక డాన్స్ విషయంలో కేవలం శ్రీ లీలకు పోటీగా సాయి పల్లవి మాత్రమే ఉంటుందని కూడా చెప్పవచ్చు.. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ తో ఒక సినిమా.. ఈ రెండు సినిమాలు తప్ప మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో ఎందుకు శ్రీలీల సినిమాలను ఒప్పుకోవడం లేదనే విషయంపై అభిమానులు తెగ సందేహా పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే శ్రీ లీల యాక్టింగ్ స్కిల్స్ పైన పలు చర్చలు జరుగుతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి..

పుష్ప -2 లో అవకాశం..
ఇటీవలే పుష్ప-2 చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఈమె అప్రోచ్ అయ్యారని.. అయితే ఈమె రిజెక్ట్ చేసిందని సమాచారం.. పాన్ ఇండియా సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేయడం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీయగా.. తాను హీరోయిన్గా ఫోకస్ అవ్వాలే తప్ప ఐటెం భామగా కాదనీ తెలియజేసినట్టు తెలుస్తోంది. ఈ కారణం వల్ల తాను ఊహించినంత కంటే ఎక్కువ పారితోషకం ఇస్తామన్నా కమిట్ అవ్వలేదట శ్రీ లీల.. శ్రీ లీల కొత్త సినిమాల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

నటిగా గుర్తింపు కోసం తాపత్రయం..
శ్రీ లీల ఇలాంటి బలమైన మార్పు వెనక మరొక కారణం ఉందని.. ఇండస్ట్రీ ఆమెను నటిగా గుర్తించకపోవడంతో పాత్రల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందని.. డాన్సర్ గా మాత్రమే ఆమెను గుర్తిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయం పైన అభిమానులు మాత్రం దర్శక నిర్మాతలను ఏకీపారేస్తున్నారు..కేవలం శ్రీ లీలా ఉందంటే తన పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పాటలకు హీరోల పక్కన డాన్స్కు మాత్రమే తనని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు భగవంత్ కేసరి సినిమాలో మినహా ఎవరు కూడా తనలోని నటిని పెద్దగా గుర్తించలేదని..అలాంటి పాత్రలు ఉంటే ఇవ్వాలంటూ దర్శక నిర్మాతలను అభిమానులు కోరుకుంటున్నారు..

శ్రీలీలకి మద్దతుగా ఫ్యాన్స్..
మరి దీన్ని బట్టి చూస్తే ఇక మీదట శ్రీలీల ను ఆమెలోని నటనను వాడుకుంటారా లేకపోతే కేవలం కుప్పిగంతులకే పరిమితం చేస్తారా అనే విషయం దర్శక నిర్మాతల పైన మాత్రమే ఆధారపడి ఉన్నది.. అందుకే శ్రీ లీల కూడా స్పెషల్ సాంగులను పక్కనపెట్టి మరి కేవలం నటన పైన ఎక్కువగా ఫోకస్ చేస్తునట్లు తెలుస్తోంది. ఈ విషయం పైన అటు అభిమానులు కూడా శ్రీలీలఇలా చేస్తోంది కరెక్టే అన్నట్లుగా వెల్లడిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు