Gaami vs Bheema : ఫస్ట్ డే కలెక్షన్స్ లో కింగ్ ఎవరంటే?

ఈ శుక్రవారం థియేటర్లలోకి గామి, భీమా అనే రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా గామితో యంగ్ హీరో విశ్వక్ సేన్, భీమాతో సీనియర్ హీరో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధపడ్డారు. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో గామిదే పైచేయిగా నిలిచింది. మరి ఇంతకీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో విన్నర్ గా నిలిచింది ఎవరు? అంటే…

గామి ఫస్ట్ డే కలెక్షన్స్…
విశ్వక్ సేన్ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ “గామి”. విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి విజువల్స్, విఎఫ్ఎక్స్, బిజిఎం హైలెట్స్ గా నిలిచాయి. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా నిలిచింది గామి. మూడు కథలను కలుపుతూ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పించగలిగాడు. మొదటి రోజు ఈ మూవీ మొత్తంగా 9 కోట్ల 7 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్టు చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. నైజాం ఏరియాలో ఫస్ట్ డే 3 కోట్లకు పైగా, ఓవర్సీస్ లో కోటి వరకు కలెక్షన్స్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ఇలాగే కంటిన్యూ అయితే ఈ మూవీ వీకెండ్ లో బ్రేక్ ఈవెంట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

“భీమా” ఫస్ట్ డే కలెక్షన్స్…
మాచో హీరో గోపీచంద్ ఈ మహాశివరాత్రికి భీమా మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కన్నడ డైరెక్టర్ హర్ష ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టగా, మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా, భీమాకు దాదాపు 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మహేంద్ర గిరి అనే ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ పరశురామ క్షేత్రాన్ని భీమా ఎలా తెరిపించాడు అనేదే స్టోరీ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 30 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. టాక్ తో సంబంధం లేకుండా బిసి సెంటర్స్ లో భీమా మూవీ బాగానే ఆడుతుంది. కానీ రొటీన్ కథతో డైరెక్టర్ హర్ష ఈ మూవీని రూపొందించాడు అనే రివ్యూలు ఓపెనింగ్ పై ఎఫెక్ట్ చూపించాయి. ఫస్ట్ డే భీమా నైజాం ఏరియాలో కోటి 80 లక్షలు, ఆంధ్ర, సీడెడ్ లో కోటి 20 లక్షల కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

భీమా వర్సెస్ గామి
మార్చి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాల్లో భీమాపై గామిదే డామినేషన్ నడుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే భీమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్ పై స్ట్రాంగ్ ఎఫెక్ట్ పడింది. అయితే యావరేజ్ అనే టాక్ వచ్చినప్పటికీ గామి విజువల్స్, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయనే టాక్ రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా విశ్వక్ విజేతగా నిలిచాడు. అయితే ఈ శివరాత్రి బాక్స్ ఆఫీస్ పోటీలో విన్నర్ ఎవరు అంటే క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేదాకా ఆగాల్సిందే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు