Gaami : విశ్వక్ ‘గ్యాంగ్’ కి ఫుల్ గిరాకీ..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ మూడు సినిమాలు రిలీజ్ అవగా, వేటికవే డిఫరెంట్ జోనర్లో తెరకెక్కాయి. అయితే అందులో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమా “గామి”. రిలీజ్ నెల ముందు వరకూ కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాను విద్యాధర్ దర్శకత్వం వహించాడు. పలు వాయిదాల అనంతరం మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యానానిమస్ గా మంచి టాక్ తెచ్చుకుంది. శివరాత్రి సినిమాల్లో ఓపెనింగ్స్ పరంగా, ఓవరాల్ గా కూడా “గామి” సినిమానే విజేత అని ఆల్మోస్ట్ తేలిపోయింది.

అయితే బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంటుందా లేదా అనేది ఇంకో వారం రోజులు ఆగాక తేలుతుంది. అయితే రిలీజ్ కి ముందు వరకూ ఈ సినిమా కాన్సెప్ట్ జనాలకు అర్థమవుతుందో లేదోనని గామి మేకర్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఆడియన్స్ రెస్పాన్స్ తో ఇక గామి మేకర్స్ కి డౌట్లు అన్ని క్లియర్ అయిపోయాయి. రిలీజ్ అయిన ఫస్ట్ డే 8.67 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్ లో 20 కోట్ల వసూళ్లు దాటొచ్చని అంచనా. అయితే ఈ సినిమా విజయంతో విశ్వక్ సేన్ తదుపరి సినిమాపై బిజినెస్ పరంగా భారీ డిమాండ్ వస్తున్నట్లు టాక్ నడుస్తుంది. గామి తర్వాత విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి. ఈ సినిమాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ గిరాకీ డిమాండ్ అవుతున్నట్టు సమాచారం.

గామి వల్ల గ్యాంగ్ కి డిమాండ్..

- Advertisement -

విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ రాబోయే సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి పై బయ్యర్ల డిమాండ్ ఎక్కువైందని టాక్ నడుస్తుంది. అంతకు ముందు విశ్వక్ సేన్ నటించిన సినిమాలు హిట్ అయినా అవి ఒక మోస్తరు విజయాలే. కానీ గామి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తర్వాత గ్యాంగ్స్ అఫ్ గోదావరి పై బజ్ ఎక్కువైందని టాక్. అయితే నిజానికి మార్చి 8న గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమానే రిలీజ్ కావాల్సింది. కానీ పలు పెద్ద సినిమాల పోటీవల్ల ఈ సినిమా వాయిదా పడింది. తీరా ఆ సినిమాలు కూడా సమ్మర్ కి షిఫ్ట్ కావడంతో ఈ పండక్కి అనూహ్యంగా విశ్వక్ సేన్ నటించిన సినిమాయే మళ్ళీ వచ్చింది.

ఇప్పుడు గామి హిట్ టాక్ తెచ్చుకోవడంతో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. పైగా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ పక్కా మాస్ బ్యాక్ డ్రాప్ తో, పల్లెటూరి నేపథ్యంలో జరిగే ముఠా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కడం వల్ల కమెర్షియల్ గా గిరాకీ బాగానే అవుతున్నట్టు టాక్. ఇక ఈ సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య చాలా ఇంటెన్స్ గా తీర్చిదిద్దినట్టు టాక్ ఉంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ప్లస్ అవనుంది. అయితే ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ డేట్ ని ప్రకటించాల్సి ఉంది. ఇక బిజినెస్ పరంగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి 15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు