Bandla Ganesh: బండ్ల గణేష్ కి జైలు శిక్ష..!

Bandla Ganesh

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి తాజాగా జైలు శిక్ష పడింది.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది… బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాదు రూ .95 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజులు గడువు కూడా కోర్టు ఇచ్చింది.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో కేసు వేశారు సదరు వ్యక్తి.. దీంతో కోర్టు చెక్ బౌన్స్ విషయంలో జరిగిన మోసానికి బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష అలాగే రూ.96 లక్షల జరిమానా విధించింది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.. ఇక ఈమధ్య త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి తనను దూరం పెట్టారని.. త్రివిక్రమ్ పై పరోక్షంగా నిందలు కూడా వేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు నటుడిగా మంచి పేరు దక్కించుకున్న బండ్ల గణేష్ ఇటీవల హీరోగా కూడా ఒక సినిమా చేసి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు.. మరొకవైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ బాగా క్యాష్ చేసుకుంటున్నారు.

అంతేకాదు బండ్ల గణేష్ పలు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే..ఇక ఇప్పుడు ఇలా ఈ విషయంలో జైలు శిక్ష విధించడంతో అభిమానులు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బండ్ల గణేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరొకవైపు పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా పేరు దక్కించుకున్న బండ్ల గణేష్ పై కేసు నమోదు అయిన విషయం పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుసుకొని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు