Trivikram: ఇక మహేష్ ఫ్యాన్స్ కుర్చీని మడతపెట్టి స్టేటస్ లు పెట్టడమే

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు అని చెప్పొచ్చు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే వీళ్ళకి పాన్ ఇండియా రేంజ్ లో ఆదరణ దక్కకపోయినా, తెలుగు స్టేట్స్ లో వీళ్ళ సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో రచ్చ మొదలవుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వీరిద్దరూ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.

ఇకపోతే మహేష్ బాబు రీసెంట్ గా చేసిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మొదటి షో నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా అయితే భారీ నష్టానికి గురికాలేదు. దానికి కారణం మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయింది. దానికి తోడు అనే బ్రాండ్ కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కూడా కొంతమేరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇదివరకే మహేష్ బాబు చేసిన బిజినెస్ మాన్, దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట వంటి సినిమాలకు సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చాడు థమన్. మొదట ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కి చాలామంది అభిమానులు నిరాశ పడ్డారు. కానీ రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసిన కొన్ని సాంగ్స్ అద్భుతమైన హిట్ అయ్యాయి. అందులో అమ్మ పాట సినిమాలో లేకపోయినా కూడా మంచి ఫీల్ ఇచ్చింది.

- Advertisement -

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే అందరూ ఇది ఒక కమర్షియల్ ఫిల్మ్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్ కు వచ్చారు. కానీ అనుకోని విధంగా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలిసి వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు డాన్సులు కూడా ఎపుడూ చేయని విధంగా చేశాడు. ఈ సినిమాలో కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ ని థియేటర్లో ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఆ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రొడక్షన్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు