Chiranjeevi: భార్యతో కలిసి చిరు ట్రిప్… వాలెంటైన్స్ డే కూడా కలిసొచ్చింది కదా!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మోకాలి గాయం నుండి కోలుకొని, తన నెక్స్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తరువాత సెట్లో అడుగు పెట్టిన ఆయన తాజా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, భార్యతో కలిసి చిన్న వెకేషన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ప్లాన్ కి వాలెంటెన్స్ డే కూడా కలిసి రావడం విశేషం. ఇంతకీ మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారు? “విశ్వంభర” షూటింగ్ సంగతేంటి? ఆయన వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 2025 జనవరి 10న సినిమాలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మొదలైన రెండవ షెడ్యూల్ ను మెగాస్టార్ చిరంజీవి పూర్తి చేశారు.

అనంతరం షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్న చిరు తన భార్యతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ ఈ ట్రిప్ లో తన సతీమణి సురేఖతో కలిసి యూఎస్ఏకి వెళ్లినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ పై పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండగా, అది ఇంకా ఆగలేదు. అమెరికా వరకు పాకింది. పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ ను కాలిఫోర్నియాలో ఘనంగా సత్కరించడానికి ప్లాన్ చేశారట అభిమానులు.

- Advertisement -

అందులో భాగంగానే యూఎస్ఏ కి వెళ్ళిన మెగాస్టార్ కి వాలెంటైన్స్ డే కూడా కలిసి వచ్చింది. మొత్తానికి సినిమా షెడ్యూల్ తో గజిబిజిగా గడపకుండా ఈ ప్రేమికుల రోజున తన భార్యతో కలిసి గడిపే సమయం దొరికింది చిరంజీవికి. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆయన సతీమణికి ఇచ్చే వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరు మరో పది రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మార్చ్ లో “విశ్వంభర” కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు