Jabardasth Vinod: అలాంటి సమస్యతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ కమెడియన్..!!

బుల్లితెరపై సంవత్సరాల తరబడి ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇప్పటికే చాలామంది ఈ షో ద్వారా తమ కెరీర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే ..అంతేకాదు ఈ షోలో చేసిన చాలామంది కోట్ల ఆస్తుల కూడబెట్టి ఇప్పుడు ధనవంతులు కూడా అయిపోయారు.. అయితే మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో అభిమానులను మరింత బాధ పెడుతున్నారు.. మొన్నటి వరకు పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడి ఇటీవలే కోలుకోగా ఇప్పుడు మరొక కమెడియన్ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు..ఆయన ఎవరో కాదు వినోద్ అలియాస్ వినోదిని..

లేడీ గెటప్ లతో వినోదిని..
లేడీ గెటప్లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వినోద్.. అమ్మాయిలా కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలా అమ్మాయి గెటప్ లో నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ వినోదిని అసలు పేరు వినోద్.. జబర్దస్త్ లో ఆఫర్ల కోసం అమ్మాయి గెటప్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. గయ్యాళితనంతో కూడిన స్కిట్లు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు వినోద్.. తాను అబ్బాయి అనే ఆలోచన ఏమాత్రం రాకుండా అంతటి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో , పంచ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది అభిమానుల ఆదరాభిమానాలు కూడా చూరగొన్నారు.. ముఖ్యంగా చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లతో రకరకాల స్కిట్లు చేసి పాపులర్ అయ్యారు..

లంగ్స్ ఇన్ఫెక్షన్..
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి జబర్దస్త్ కి దూరమయ్యాడు వినోద్.. చాలా రోజులుగా కనిపించడం లేదు..కారణం అనారోగ్యంతో తాను దూరమైనట్టు.. ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.. అయితే ఇప్పుడు మరింత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు… అంతేకాదు వినోద్ ని ఇలా చూసి ఇతడు నిజంగానే వినోదేనా అనే ఆశ్చర్యపోయేలా చాలా సన్నగా మారిపోయారు.. ప్రస్తుతం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.. రెండేళ్ల క్రితమే దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.. అయితే ఊపిరితిత్తులలో నీరు పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందట.. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్టు తెలిపారు. ఈ కారణంగానే తాను బరువు తగ్గినట్లు తెలిపారు వినోద్.. ఉన్నట్టుండి నెలలోనే చాలా బరువు తగ్గిపోవడంతో అనుమానం వచ్చి టెస్టులు చేస్తే.. ఈ వ్యాధి నిర్ధారణ అయిందని లంగ్స్ నుంచి నీరు తీసేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారు.. ఇక తర్వాత ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడమే దీనికి ప్రధాన కారణం అయిందని తెలిపారు వినోద్ .. ప్రస్తుతం ఆ సమస్య నుండి బయటపడ్డారు కానీ ట్రీట్మెంట్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది అంటూ తెలిపారు.. ఇక త్వరలోనే మంచి ఫుడ్ తీసుకొని మళ్ళీ బరువు పెరుగుతానని మునుపటిలాగే మిమ్మల్ని నవ్విస్తాను అంటూ చెబుతున్నారు వినోద్..

- Advertisement -

అండగా కుటుంబం..
తనకు ఈ సమస్య వచ్చినప్పుడు కుటుంబం ఎంతో సపోర్టుగా నిలిచిందని.. అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా ఎంతో సపోర్ట్ చేశారని.. మంచి డాక్టర్ని కలవడంతో వారి సహకారం ఎంతో ఉందని తెలిపారు.. ఫైనాన్షియల్ గా కూడా కొంత సహాయం అందించారని కూడా తెలిపారు వినోద్..

రోజా వల్లే..
జబర్దస్త్ మాజీ జడ్జ్ , మంత్రి రోజా తనకు అండగా నిలిచిందని.. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం పై ఆరా తీసిందని.. తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వినోద్ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు