Pavala Syamala: నడవలేని స్థితిలో నటి పావలా శ్యామల..!

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము.. సినిమా రంగంలో ఒకప్పుడు చేతినిండా పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఆ తర్వాత అవకాశాలు లేక చాలా ధీనమైన పరిస్థితిని ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో నటి పావలా శ్యామల కూడా ఒకరు.. చిరంజీవి , వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలను మొదలుకొని.. ఎన్టీఆర్, గోపీచంద్ వంటి తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది నటి పావలా శ్యామల.. ప్రస్తుతం తినడానికి తిండి లేక వృద్ధాశ్రమంలో చాలా ధీనమైన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నట్టు తెలుస్తోంది.. ఒకప్పుడు నటిగా బిజీ లైఫ్ ను చూసిన పావలా శ్యామల.. ఇప్పుడు ఇలా దీనమైన స్థితిలో చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు..

షోలో కనిపించిన శ్యామల..
పావలా శ్యామల వయసు సహకరించకపోవడంతో సినిమాలలో పెద్దగా ఈమె కనిపించలేదు.. తనతో పాటు తన కూతురు అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసింది.. ఇప్పుడు ఇద్దరికీ చికిత్స చేయించుకుంటూ ఉండటం వల్ల డబ్బులు సరిపోడం లేదని.. దాంతో తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆమె వెల్లడించింది.. ఈమె పరిస్థితి తెలుసుకున్న చాలా మంది సినీ తారలు ఈమెకు ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తున్నారు.. ప్రస్తుతం పావలా శ్యామల నడవలేని స్థితిలో.. ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ప్రత్యేకమైన షో లో కనిపించారు.

ఆ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో..
ఈ షోలో పావల శ్యామల మాట్లాడుతూ.. అందరి హీరోలతో తాను నటించానని.. అన్నీ హిట్ సినిమాలలో నటించాను.. కానీ చివరికి తన బ్రతుకు ఇలా అవుతుందని అసలు అనుకోలేదని ఎమోషనల్ అయ్యింది.. ఇలాంటి దుస్థితి వస్తుందని తాను కూడా అసలు తన జీవితంలో ఎప్పుడూ ఊహించుకోలేదని.. తన కష్టాలను చెప్పుకొని ఇతరులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు.. తాను బ్రతుకుండి .. తిని తారలందరినీ మళ్లీ చూస్తానో లేదో అనే భయంతో మీ ముందుకు ఒకసారి కనిపించి మీ అభిమానం పొందాలని వచ్చాను అంటూ పావల శ్యామల కంటతడి పెట్టుకుంటూ మాట్లాడింది.

- Advertisement -

అండగా కాదంబరి కిరణ్..
అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతోంది.. మనం సైతం అనే ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్న కాదంబరి కిరణ్.. ఇటీవల శ్యామలను కలిసి ఆమెకు మరో 25వేల రూపాయల చెక్ ని సైతం అందించారు.. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు పావలా శ్యామల దుస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం కూడా చేశారు.. ముఖ్యంగా కరాటే కళ్యాణి కరోనా సమయంలో ఇతర సెలబ్రిటీల దగ్గర డబ్బులు వసూల్ చేసి ఈమెకు సహాయంగా అందించింది. అంతేకాదు తన దుస్థితిని అందరికీ అర్థమయ్యేలా చేసింది దీంతో అందరూ అలర్ట్ అయ్యి తమకు తోచినంతగా ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టారు.. ఏది ఏమైనా ఒకప్పుడు బిజీ ఆర్టిస్టుగా పేరు పొందిన పావలా శ్యామల ఇలాంటి దీనమైన పరిస్థితిలో చూసి అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు