R.K. Roja: మంత్రి రోజా నటించిన ఏకైక బాలీవుడ్ చిత్రం ఏంటంటే..?

అలనాటి హీరోయిన్లలో తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది హీరోయిన్ రోజా.. అధికార పార్టీ వైసీపీ తరఫున మినిస్టర్ గా రోజా నగరి ప్రాంతంలో కొనసాగుతోంది. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మంత్రి పదవి రావడంతో రోజా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నది.. గతంలో జబర్దస్త్ ప్రోగ్రాం కి జడ్జిగా వ్యవహరించిన రోజా.. వాటిని కూడా పొలిటికల్ కారణంగా దూరం చేసుకుంది.

హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రోజా బాలీవుడ్ సినిమాలో కూడా నటించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. మహేష్ భట్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ది జెంటిల్మెన్ అనే సినిమాలో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అయితే అక్కడ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రోజా మళ్లీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక తర్వాత టాలీవుడ్ కే పరిమితమైన ఈమె ఎక్కువగా టాలీవుడ్ సినిమాలలో అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించింది. ఇప్పుడు నగరి ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలలో మమేకమవుతున్నారు. ఎంతో మంది ప్రతిభ ఉన్న విద్యార్థులను సైతం చదివిస్తూ ఉన్నది.

ఈమె కూతురు కూడా ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేస్తూ తన తల్లితోపాటు క్రేజ్ ను సంపాదించుకుంటోంది. రోజా సినీ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటిని ఎదిరించి మరి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం జరిగింది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రోజా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈమె ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణి ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది రోజా. రోజా అభిమానులు మాత్రం ఈమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. గతంలో గోపీచంద్ నటించిన గోలీమార్ సినిమాలో ప్రియమణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు సైతం అందుకుంది.

- Advertisement -

కానీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి తనకు చాలా ఆశగా ఉందంటూ తన కోరికను సైతం బయట పెట్టడం జరిగింది.ఎన్నోసార్లు ఈ విషయాన్ని రోజా తెలియజేసేది కానీ సరైన అవకాశం మాత్రం రాలేదని తెలిపింది. కావాలనే కొంతమంది రోజాను ట్రోల్ చేస్తూ ఉంటారు కానీ ఈమె ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లోనైనా అభిమానుల కోరిక మేరకు రోజా రియంట్రి ఇస్తుందేమో చూడాలి మరి. అభిమానులు కూడా రోజా కొన్ని కొన్ని పాత్రలకు కరెక్టుగా సరిపోతుందంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు