OTT Releases : ఈ వారం ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటి ప్లాట్ఫారంలో కొన్ని సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్ రెండవ వారం కొనసాగుతుండగా, ఈ వారాంతం ఓటిటి ప్రియులను థ్రిల్ చేయడానికి పలు ఆసక్తికర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వారం ఓటిటి ప్లాట్ ఫామ్ లో రానున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏంటి? ఏ ఓటిటిలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే… ఇందులో ‘వధువు’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన ‘వధువు’ డిసెంబర్ 8న డిస్నీలో రాబోతోంది. అవికా ఓ ఇంటికి కోడలుగా అడుగు పెట్టగా, ఆ ఇంట్లో ఉన్న మిస్టరీని ఛేదించే ‘వధువు’ కథే ఈ వెబ్ సిరీస్. దీంతోపాటు డిసెంబర్ 7న హిస్టరీ ది ఇంట్రెస్టింగ్ బిట్స్, డిసెంబరు 8న డైరీ ఆఫ్ ఏ వింపి కిడ్ క్రిస్మస్ క్యాబిన్ ఫీవర్, డిసెంబర్ 10న ది మిషన్ డాక్యుమెంటరీ ఫిలిం స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇక బిగ్గెస్ట్ రీజనల్ ఓటిటి ప్లాట్ఫారం ఆహాలో ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘మా ఊరి పొలిమేర 2’ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 8న సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రం 24 గంటల కంటే ముందే ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. క్షుద్ర పూజలు, చేతబడి వంటి మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలోకి వచ్చి హిట్ కొట్టింది.

- Advertisement -

మరో బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ రాబోతోంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ నవంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 8న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం జిగర్తాండ డబుల్ ఎక్స్ మాత్రమే కాకుండా డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో సినిమాలు ఇందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ లో సైతం డిసెంబర్ 7, 8 తేదీల్లో పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు రాబోతున్నాయి. తాజాగా ప్రైమ్ లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన ‘అహింస’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు