Pushpa 2 : బాలీవుడ్ స్టార్ స్పెషల్ రోల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప 2” మూవీ తెరకెక్కుతుండగా, దీనికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు పుష్ప రాజ్ రాక కోసం ఎగ్జైటింగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై మరింతగా అంచనాలను పెంచే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ బడా స్టార్ భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ స్టార్ ఎవరు? అని వివరాల్లోకి వెళ్తే…

“పుష్ప 2” లేటెస్ట్ అప్డేట్
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో నెక్స్ట్ రాబోతున్న సీక్వెల్ “పుష్ప 2″పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప అనే వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక మూవీలో ఫస్ట్ పార్ట్ లో నటించిన పలువురు నటీనటులతో పాటు కొత్త యాక్టర్స్ కూడా భాగం కాబోతున్నారని గత కొన్ని రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, ఫాహద్ ఫాసిల్ వంటి వారు నటిస్తుండగా, సినిమాపై హైప్ గ్రాఫ్ ను మరింతగా పెంచడానికి బాలీవుడ్ బడా స్టార్ పుష్ప రాజ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. సంజయ్ దత్ ఈ మూవీలో స్పెషల్ రోల్ చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలు అల్లు అర్జున్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

సంజయ్ దత్ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా…

- Advertisement -

ఇటీవల కాలంలో సంజయ్ దత్ నటించిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా రికార్డులు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కేజిఎఫ్, లియో వంటి సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ రాక పుష్ప రాజ్ కు కలిసి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతేకాకుండా నిన్న మొన్నటిదాకా “ఆర్య 2” సెంటిమెంట్ ప్రకారం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చే రెండవ సినిమా డిజాస్టర్ అవుతుందేమో అని భయపడ్డారు. కానీ ఇప్పుడేమో సంజయ్ దత్ స్పెషల్ రోల్ అని వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో సౌత్ సినిమాలకు ఆయన సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని “పుష్ప 2” పక్కా హిట్ అని తెగ ఖుషి అయిపోతున్నారు.

“పుష్ప 2” అనుకున్న సమయానికే…
“పుష్ప 2″ను డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ పార్ట్ కు మించి పోయే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పలుమార్లు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడ్డప్పటికీ, అన్ని అవాంతరాలను దాటుకుని సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రేయి పగలు తేడా లేకుండా తెగ కష్టపడుతోంది.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 15న ప్యాన్ వరల్డ్ రేంజ్ లో “పుష్ప 2” థియేటర్లలోకి రాబోతోంది. అలాగే జపాన్ లో కూడా ఒరిజినల్ వెర్షన్ ను రిలీజ్ చేసిన టైంలోనే విడుదల చేస్తామని రీసెంట్ గా రష్మిక మందన్న అఫీషియల్ గా వెల్లడించింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు