Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను , ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో అల్లు అర్జున్… అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకున్న మొట్టమొదటి నటుడుగా పేరుపొందారు అల్లు అర్జున్..మొదటి భాగం భారీ విజయం కావడంతో సెకండ్ పార్ట్ పైన మరింత హైప్ పెరిగిపోయింది. పుష్ప-2 చిత్రంతో సరికొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నారు అభిమానులు.. పుష్ప సీక్వెల్ రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టు 15వ తేదీ అంటూ ఎప్పుడో ప్రకటించేశారు.. దీంతో ఈ సినిమా పైన మరింత హైప్ నెలకొంది..అంతేకాదు బాహుబలి, RRR చిత్రాల వంటి రికార్డులను కూడా బ్రేక్ చేయవచ్చని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ లెక్కేస్తున్నారు..

బన్నీ మూవీకి పోటీగా స్టార్ హీరోలు సినిమాలు..
అయితే ఇప్పుడు వారి ఆశలన్నీ కూడా నిరాశలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది.. లాంగ్ వీకెండ్ లో పుష్ప-2 చిత్రంతో పోటీపడేందుకు బడా సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి ముఖ్యంగా తమిళంలో హీరో విజయ్ దళపతి డైరెక్టర్ వెంకట్రావు కాంబినేషన్లో వస్తున్న గోస్ట్ సినిమాని కూడా అప్పుడే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే తమిళంలో తెరకెక్కిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది రజినీకాంత్ సినిమానే.. అలాగే కమలహాసన్ నటిస్తున్న ఇండియన్-2 సినిమా కూడా ఆ డేట్లలోనే వచ్చేలా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందట.

పుష్ప 2 కి బాలీవుడ్లో నిరాశేనా..
అలా సౌత్ లోనే ఈ రేంజ్ లో పోటీ ఉంటే ఇక నార్త్ నుంచి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న సింగం-3 చిత్రం ఆగస్టు 15న వచ్చేందుకు డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.. ఇందులో దీపికా పదుకొనే టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలకమైన పాత్రల నటిస్తున్నారు.. హిందీలో ఈ సినిమా పుష్ప-2కంటే ఓరేంజ్ లో ఉంటుందని.. అందుకే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.. దీంతో కచ్చితంగా పుష్ప-2 సినిమాకి బాలీవుడ్ లో కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపించేలా ఉండబోతోంది.

- Advertisement -

మరి ఇలాంటి సమయంలో ఇంతమంది స్టార్ హీరోల పోటీని క అధికమించి అల్లు అర్జున్ ఇప్పుడు తాను నటిస్తున్న పుష్ప-2 సినిమాతో తన మేనియా చూపిస్తాడా అనే విషయం పైన అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. మరి ఇందులో ఏ ఏ చిత్రాలు రిలీజ్ డేట్లను అనౌన్స్మెంట్ చేసి క్లారిటీ ఇస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.. పుష్ప-2 చిత్రంతో అల్లు అర్జున్ ఎలాంటి రికార్డులను సైతం తిరగరాస్తారో చూడాలి మరి..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు