Samantha: స్టార్ హీరోలకి సమంత ట్యాగ్.. తెలిస్తే షాక్.!

సమంత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 14 ఏళ్లు పైనే అవుతోంది. సమంత నటించిన డెబ్యూ మూవీ ఏం మాయ చేసావే.. 2010లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సమంత అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పరుచుకుంది. అలా నేషనల్ వైడ్ గా కూడా పాపులారిటీ సంపాదించుకుంది సమంత. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది.. కేవలం ఒక ప్రభాస్ తో తప్ప మిగతా అందరి హీరోలతో కలసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

సమంత నటించిన హీరోలలో ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు ప్రథమ స్థానంలో ఉంటారు. వీరితో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ ముగ్గురు హీరోల కు ఒక ట్యాగ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తుందో సమంత ఒక సందర్భంలో తెలియజేసింది..యాంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎలాంటి ట్యాగ్ ఇస్తారని అడగగా.. అందుకు సమంత ఎన్టీఆర్ ఒక గ్రేట్ డాన్సర్ అని తెలియజేసింది. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం బృందావనం సినిమాలో నటించాను అప్పుడే ఆయన డాన్స్ ని గుర్తించాను అంటూ వెల్లడించింది. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, రభస వంటి చిత్రాలలో కూడా నటించింది.

మహేష్ బాబు..
ఇక మహేష్ బాబుకి ఏం ట్యాగ్ ఇస్తారంటే.. అందుకు సమంత మోస్ట్ డిజైరబుల్ పర్సన్ అని తెలియజేసింది. సమంత మహేష్ కాంబినేషన్లో దూకుడు సినిమా రాగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.. ఈ చిత్రాలు మూడు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి

- Advertisement -

పవన్ కళ్యాణ్..
ఇక పవన్ కళ్యాణ్ కి మీరు ఇచ్చే ట్యాగ్ ఏంటని అడగగా.. అందుకు సమంత కాస్త భిన్నంగా ఆలోచిస్తూ మై గురూ అని చెప్పేసింది…పవన్ కళ్యాణ్ తో నాది గురు శిష్యుల అనుబంధం అంటూ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ సమంత కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇక ఇలా సమంత తాను నటించిన ముగ్గురు హీరోల గురించి కామెంట్లు చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సమంత వ్యక్తిగత జీవితం..
హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉండగా.. సమంత గత కొన్నేళ్లుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉండడంతో సినిమాలకి కాస్త దూరంగా ఉంటూ ఆ వ్యాధికి సంబంధించి చికిత్సను తీసుకోవడానికి విదేశాలను చుట్టేస్తోంది. అక్కడ వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అప్పుడప్పుడు అభిమానులను చిల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తిరిగి మళ్ళీ సినిమాలలో నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సమంత. ఇకపోతే బాలీవుడ్ లో ఈమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు