Maha Shivaratri: అఘోర పాత్రల్లో మెప్పించిన హీరోలు వీరే..!

ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే ఏదైనా ఒక కొత్త పద్ధతి వచ్చిందంటే అది ట్రెండ్ సెట్ చేస్తుందనటంలో సందేహం లేదు.ఈమధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో అఘోర అనే పదం మాత్రం చాలా కామన్ గా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎక్కువగా ఇప్పుడు అఘోర పాత్రలలో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాలో కూడా విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించారు.. ఈ సినిమాకి ఈ పాత్ర చాలా మంచి బజ్ ను తీసుకువచ్చింది. ఇకపోతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విశ్వక్ సేన్ తో సహా మన టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు అఘోర పాత్రలో కనిపించారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నందమూరి బాలకృష్ణ..
లెజెండ్రీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో అఘోర పాత్రలో కనిపించారు.. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటివరకు బాలయ్య చేసినటువంటి క్యారెక్టర్లలో.. ఇది బెస్ట్ క్యారెక్టర్ అని కూడా చెప్పవచ్చు.

List of Heroes who Played Aghora Roles

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి కూడా అఘోర పాత్రలో కనిపించారు. ముఖ్యంగా శ్రీమంజునాథ సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశంలో అఘోర పాత్రలో అందరిని భయపెట్టించేశారు చిరంజీవి .. మొదటిసారి పౌరాణిక పాత్ర చేసినప్పటికీ మహా శివుడి పాత్రలో అద్భుతంగా నటించారు.

List of Heroes who Played Aghora Roles

అక్కినేని నాగార్జున..
అక్కినేని నాగార్జున కూడా ఢమరుకం సినిమాలో ఒక సన్నివేశంలో అఘోర పాత్రలో కనిపించారు.. అంతేకాకుండా శ్రీ ఆదిశంకరాచార్యులు సినిమాలో కూడా చండాలుడి వేషంలో కనిపించారు..

List of Heroes who Played Aghora Roles

విక్టరీ వెంకటేష్.
విక్టరీ వెంకటేష్ కూడా నాగవల్లి సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలోనే కాకుండా.. ఒక అహంకారి రాజు అయిన పాత్రలో కూడా కనిపించారు. ఇందులో ఆ రాజే అఘోరగా మారి కనిపిస్తారు..

List of Heroes who Played Aghora Roles

సోనూసూద్..
అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం అరుంధతిలో నటుడు సోనూ సూద్ కూడా “అమ్మా బొమ్మాలి” అంటూ అఘోర పాత్రలో ప్రతి ఒక్కరిని భయపెట్టేశారు.. ఈ సినిమా అటు అనుష్క కెరియర్ ను.. ఇటు సోనూసూద్ కెరియర్ ను మార్చేసింది.

List of Heroes who Played Aghora Roles

నాగబాబు..
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా అఘోర అనే టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కించారు.. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యిందో కూడా చాలామందికి తెలియకపోవచ్చు..

List of Heroes who Played Aghora Roles

ఆర్య..
నేనే దేవున్ని అనే చిత్రంలో ఆర్య కూడా అఘోర పాత్రలోనే నటించారు..

List of Heroes who Played Aghora Roles

మంచు మనోజ్..
మంచు మనోజ్ గత కొన్నేళ్ల క్రితం ప్రకటించిన చిత్రం అహం బ్రహ్మాస్మి.. ఈ సినిమాలో కూడా మంచు మనోజ్ అఘోర పాత్రలో కనిపించబోతున్నారు.. అయితే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.. మొత్తానికి చాలామంది సెలబ్రిటీలు సైతం అఘోర పాత్రలో నటించారు.. ఇది చూసిన అభిమానులు ఈ పాత్రలో నటించడం అంత సులువైనది కాదని కూడా చెప్పవచ్చు.. ఏదేమైనా ఇలా అఘోరా పాత్రలో నటించి తమలోని అద్భుతమైన నటనను కనబరిచారు సెలబ్రిటీలు..

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు