Women’s Day : పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేసిన సౌత్ హీరోయిన్లు వీళ్లే 

మహిళల విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాంటి వివక్ష చూపకుండా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా గౌరవం, గుర్తింపు ఇవ్వాలి అన్నదే ఈ ఉమెన్స్ డే ప్రధాన ఉద్దేశం. నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన సౌత్ హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం.

1. అనుష్క
లేడీ ఓరియంటెడ్ అనగానే ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అనుష్క ముందుగా గుర్తొస్తుంది. ఈ బ్యూటీ ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అరుంధతి మూవీతో మొదలైన అనుష్క ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ప్రయాణం పంచాక్షరి, రుద్రమదేవి, భాగమతి, మిస్ షటి మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాల దాకా నడిచింది. బాహుబలి తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇప్పుడు కంటెంట్ సెలక్షన్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి అనుష్క రెడీ అయినట్టు టాక్ నడుస్తోంది.

2. నయనతార
హీరోతో పని లేకుండా సినిమాలతో సమర్థవంతంగా కథను నడిపించగల సత్తా ఉన్న నటి నయనతార. అందుకే ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇప్పటిదాకా ఈ బ్యూటీ మయూరి, అనామిక, కోకో కోకిల, ఐరా, డోరా, O2, నేత్రికన్ చిత్రాల్లో నటించి వన్ ఉమెన్ షోగా సినిమాలను నడిపించింది. రీసెంట్ గా అన్నపూర్ణ : ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం నయనతార హీరోయిన్ గా “మన్నంగట్టి సిన్స్ 1960” అనే మూవీ రూపొందుతోంది.

- Advertisement -

3. ప్రియమణి
రీసెంట్ గా ప్రియమణి ‘భామా కలాపం” అనే వెబ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఒక మహిళ తనకు వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నది అన్నదే ఈ మూవీ నేపథ్యం. రెండు భాగాలుగా వచ్చిన భామా కలాపంకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

4. ఐశ్వర్య రాజేష్
ఈ తరం హీరోయిన్లలో లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయంలో చెప్పుకోవాల్సిన మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు కెరీర్ మొదటి నుంచి ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న ఐశ్వర్య ఇప్పటిదాకా భూమిక, కౌసల్య కృష్ణమూర్తి, డ్రైవర్ జమున, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, రన్ బేబీ రన్, స్వప్న సుందరి, ఫర్హానా వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అలరించింది.

5. రష్మిక మందన్న
Women’s Day : పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేసిన సౌత్ హీరోయిన్లు వీళ్లే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరియర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. హీరోయిన్ గా మంచి స్టార్డం మూట కట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో రెయిన్ బో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోంది. ఇక వీళ్లతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా, రుహని శర్మ వంటి హీరోయిన్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు