Nagarjuna: నాగచైతన్యతో ప్రత్యేక పూజలు చేపిస్తున్న నాగార్జున ?

Nagarjuna pooja for akkineni nagachiatanya: అక్కినేని కుటుంబానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకొని అక్కినేని నాగార్జున కుటుంబం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి చాలామంది హీరోలు అలాగే అన్నపూర్ణ స్టూడియో లాంటివి ఇండస్ట్రీకి అండదండలుగా నిలిచాయి. నందమూరి కుటుంబం అలాగే మెగాస్టార్ కుటుంబం తరహాలోనే అక్కినేని కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా మొదటి నుంచి చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది అక్కినేని కుటుంబం. అందుకే ఈ కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. అయితే అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకటే కలత. తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత వివాహం జరిగి విడాకులు అయ్యాయి. అటు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెఠాకులైంది.

Nagarjuna pooja for akkineni nagachiatanya
Nagarjuna pooja for akkineni nagachiatanya

దీనికి తోడు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ చేస్తున్న సినిమాలు ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ కావడం లేదు. అక్కినేని నాగచైతన్య గురించి పక్కకు పెడితే అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టలేదు. ఈ అన్ని విషయాలు అక్కినేని కుటుంబంలో ఒక కలవరాన్ని నింపాయి. ముఖ్యంగా తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్యకు రెండవ పెళ్లి చేయాలని మొదటి నుంచి అనుకుంటున్నారట అక్కినేని నాగార్జున. Nagarjuna pooja for akkineni nagachiatanya

- Advertisement -

కానీ అక్కినేని నాగచైతన్య జాతకంలో ఓ పెద్ద గండం ముందట. మొన్నటి వరకు ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఈ గండడం కారణంగానే సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడిపోయారని అందరూ ప్రచారం చేశారు. ఇక రెండో పెళ్లి చేసుకుంటే కూడా మళ్లీ విడిపోతారని అక్కినేని నాగచైతన్య ఒక ఆలోచనకు వచ్చారట. అయితే అక్కినేని నాగచైతన్య జీవితంలో ఉన్న ఆ గండాన్ని తొలగించేందుకు అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారట.

దీనికోసం అక్కినేని నాగచైతన్య తో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారట ఆ నాగార్జున. ఆ గండం తొలగిన తర్వాత రెండవ పెళ్లి కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారట నాగార్జున. కాగా అక్కినేని నాగచైతన్య మరియు సమంత 2021 సంవత్సరంలో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం 2017 సంవత్సరంలో జరిగింది. అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. దాదాపు 14 సంవత్సరాల కింద వీరు ప్రేమించుకున్నారు.

అయితే కొన్ని చెప్పలేని కారణాలవల్ల అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోయారు. అటు విడిపోయిన తర్వాత ఎవరు సినిమాలు వారు చేసుకుంటున్నారు. కానీ విడాకులు అయిన తర్వాత హీరోయిన్ సమంత మయో సైటీస్ అయినా భయంకరమైన వ్యాధి బారిన పడింది. అటు అక్కినేని నాగచైతన్య మాత్రం సినిమాలలో సక్సెస్ కావడం లేదు. ఇలా అక్కినేని కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు