Malavika Mohanan: చీరలో రెచ్చిపోయిన మాళవిక

Malavika Mohanan: ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఏదైనా సరే హీరోయిన్గా సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ రాణించాలన్న ఎక్స్పోజింగ్ మాత్రం పక్కా ఉండాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది. అసలు ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు కూడా ! గతంలో అలా లేకుండే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాగే తయారైపోయింది.

దీంతో చాలామంది హీరోయిన్లు సక్సెస్ కావడం కోసం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పాపులర్ అయ్యేందుకు నాన కష్టాలు పడుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మరీ తమ అందాలను చూపిస్తున్నారు. అయితే అలాంటి కోవాలోకే హీరోయిన్ మాళవిక మోహన్ చేరిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ… ఇక్కడ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.

వాస్తవానికి కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ… మొదట మోడల్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత నటిగా మారిపోయింది హీరోయిన్ మాళవిక మోహన్. ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో కూడా సినిమాలు చేసింది. 2013 సంవత్సరంలో మలయాళం సినిమాలో మొదటిసారిగా మెరిసింది. 2013 సంవత్సరంలో పట్టం పోల్ అనే సినిమా వచ్చింది. ఇందులో కీలకపాత్ర వహించి మంచి సక్సెస్ అందుకుంది మాళవిక మోహన్.

- Advertisement -

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటివరకు మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ మాళవిక మోహన్. మన తెలుగులో మాత్రం ధనుష్ హీరోగా చేసిన మారాన్ సినిమా చేసింది. వాస్తవానికి ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అయింది. నేరుగా మాత్రం తెలుగులో ఈ బ్యూటీ సినిమా చేయలేదనే చెప్పవచ్చు. అయితే త్వరలో ప్రభాస్ సినిమాలో మెరిసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీకి మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ రెండు సినిమాలు చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీలో…! 2017 సంవత్సరంలో బియాండ్ ద క్లౌడ్స్, యుద్ర సినిమాలు చేసింది. అలాంటి ఈ బ్యూటీ చాన్స్ ల కోసం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తోంది. ఇక తాజాగా వైట్ శారీలో ఈ బ్యూటీ మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే ఈ వైట్ శారీలో రంగురంగుల పూలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. అందాల తార భూమిపై తిరుగుతుందా ? ఎవరు ఈ దేవకన్య..? ఎంత చక్కగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. అంతలా అన్ని చూపిస్తోంది సినిమాలలో ఛాన్సులు ఇవ్వండి రా అంటూ కొంతమంది అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు