Trisha : క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న త్రిష?

Trisha : చెన్నై చిన్నది త్రిష ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఆల్రెడీ సగం షూటింగ్ కూడా పూర్తయిన ఈ మూవీ నుంచి ఎందుకు త్రిష బయటకు వచ్చేసింది ? అంటే…

తమిళ స్టార్ అజిత్ ప్రస్తుతం తన 62వ సినిమా చేస్తున్నారు. మిఝల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి విడాముయార్చి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గత ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాకపోవడం గమనార్హం. దాదాపు మూడు నెలల పాటు అజర్‌బైజాన్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అజిత్‌తో పాటు త్రిష, అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులపై అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అజిత్-త్రిష జోడీ రిపీట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మిలన్ మృతితో విషాదకర సంఘటన చోటు చేసుకున్నప్పటికీ, సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.

మొదటి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది: చిత్రబృందం అజర్‌బైజాన్ నుండి చెన్నైకి వచ్చేశాడు. దాదాపు సినిమాలోని అన్ని ముఖ్యమైన సన్నివేశాలను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత అజర్‌బైజాన్ షెడ్యూల్ ముగిసిందని, తదుపరి లొకేషన్‌ను వెతకడంలో సిబ్బంది బిజీగా ఉన్నారని ప్రకటించారు. కానీ అజర్‌బైజాన్ షెడ్యూల్ త్వరగా పూర్తి కావడానికి భారీ ఖర్చులే కారణమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్రబృందం అంతా చెన్నైలో ఉంది. ఈ సినిమా తదుపరి దశ షూటింగ్ మార్చి 15న ప్రారంభం కానుందని అంటున్నారు. కానీ షూటింగ్‌కి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ నేపథ్యంలోనే విడాముయార్చి చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి లీక్ అయ్యింది.

- Advertisement -

బడ్జెట్ సమస్యల కారణంగా ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ షూటింగ్ ను మరో నెల పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు; దానికి అజిత్ కూడా ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. మరో షాకిచ్చే న్యూస్ ఏమిటంటే త్రిష ఈ మూవీ నుంచి తప్పుకుందట. ప్రస్తుతం అజిత్ మూవీ హోల్డ్ లో పడడంతో త్రిష బిజీ షెడ్యూల్ కారణంగా కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేకపోతోందట. ఆమె చేతిలో విశ్వంభర, థగ్ లైఫ్ వంటి సినిమాలు ఉండడంతో జనవరి 2025 వరకు ఇదే పరిస్థితి. అందుకే విడాముయార్చి మూవీ నుంచి చేసేదేం లేక త్రిష తప్పుకుంది అనే రూమర్ వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు