Indian-2 Movie Release Date : “భారతీయుడు 2” రాకకు డేట్ ఫిక్స్

Indian-2 Movie Release Date : లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన కొత్త మూవీ ‘ఇండియన్ 2’ విడుదల తేదీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారీ చిత్రాలు దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు. ఈ మూవీ రిలీజైన దాదాపు 28 సంవత్సరాల తర్వాత పార్ట్ 2 పట్టాలెక్కింది. తొలి భాగం విజయం సాధించడంతో రెండో భాగంపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. రెండో భాగానికి కంటిన్యూ సీక్వెల్ గా “ఇండియన్ 3” కూడా మొదలైపోయింది. మూడో భాగాన్ని కూడా పెద్దగా గ్యాప్ రాకుండా ముందుగానే ప్లాన్ చేశాడు డైరెక్టర్ శంకర్ .ఇప్పటికే రెండో భాగం షూటింగ్‌ పూర్తి చేసుకుని మూడో భాగం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే “భారతీయుడు 2” మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది.

“భారతీయుడు 2” రిలీజ్ డేట్ ఇదే?

సెకండ్ పార్ట్ “భారతీయుడు 2″కి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమా అప్డేట్ ను వెల్లడించారు. రెండు పార్తులకు సంబంధించిన షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నకు బదులుగా భారతీయుడు 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, అతి త్వరలోనే భారతీయుడు 3కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అవుతాయని కమల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై అనేక దశల్లో జరగనుండగా, ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం మే 24న ‘ఇండియన్ 2’ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ వంటి దక్షిణ భారత భాషల్లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చాలా గ్యాప్ తరువాత థియేటర్లలోకి రాబోతున్న ఈ సీక్వెల్ గురించి కమల్ అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య రూపొందిన యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా “భారతీయుడు 2″లో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, జయప్రకాష్, గురు సోమసుందరం, సముద్రఖని, మనోబాల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని లైకా అండ్ రెడ్ జేన్ మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు