Naga Chaitanaya: సమంత స్థానాన్ని ఆ హీరోయిన్‌కు ఇచ్చిన నాగ చైతన్య?

Naga Chaitanaya:  అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లో గత కొన్ని సంవత్సరాలుగా అక్కినేని కుటుంబానికి సముచిత స్థానం దక్కింది. అక్కినేని నాగేశ్వరరావు నుంచి అఖిల్ వరకు చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. అందులో అక్కినేని నాగచైతన్య ఒకరు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని ఎందుకు… ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు హీరో నాగచైతన్య. అలాంటి అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.Naga Chaitanaya

ఆయనకు మంచి ఫ్యాన్ ఫ్యాన్ కూడా ఉంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తండెల్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ తండాల సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్లో ఈ సినిమా రెండవది. చందు మొండేటి ఈ సినిమాను దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందిపించుకొని చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. మరికొంతమంది నిలదొక్కుకొని నమ్మకంతో ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి కోవాకే చెందిన వాడే ఈ నాగచైతన్య. జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను హీరోగా అలరించిన అక్కినేని నాగచైతన్య… ఏం మాయ చేసావే సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు.

- Advertisement -

ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మంచి హిట్ కావడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతను ప్రేమించి తన లైఫ్ ను మార్చుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే తమ వ్యక్తిగత జీవితంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోయారు. ఇక అప్పటి నుంచి సమంత మరియు అక్కినేని నాగచైతన్య ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఏడ మొహం పెడ మొహం లాగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సమంత స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో హీరోయిన్ను పట్టినట్లు సోషల్ మీడియాలో నాగచైతన్య పై వార్తలు వస్తున్నాయి.

ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అస్సలు చాన్సులు లేక సతమతమవుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. అలాంటి హీరోయిన్ పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు అక్కినేని నాగచైతన్య. తండేలు సినిమా తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగిచైతన్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ జోనర్ లో వస్తోంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫైనల్ చేశారట. దాదాపు పది సంవత్సరాల తర్వాత బుట్ట బొమ్మ పూజ హెగ్డే తో రొమాన్స్ చేయడానికి నాగచైతన్య రెడీ అయిపోయాడు. ఒక లైలా కోసం అనే సినిమాలో నాగచైతన్య మరియు పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పైన కనిపించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు