Chatrapathi: బెల్లంకొండ హిందీలో గట్టిగా ఇచ్చేలా ఉన్నాడు..!

బెల్లంకొండ శ్రీనివాస్, తొలి సినిమాతోనే భారీగా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ప్రతి సినిమాలో భారీ తారాగణం, స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటూ తన ప్రతీ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తూ వచ్చాడు ఈ యువ హీరో. అయినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ ఒకటి కూడా అందుకోలేకపోయాడు, మధ్యలో జయ జానకి నాయక, కవచం వంటి సినిమాలతో ఓకే అనిపించినా అల్లుడు అదుర్స్ తో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదిలా ఉండగా ఛత్రపతి హిందీ రీమేక్ తో వీవీ వినాయక్ డైరెక్షన్లో తన బాలీవుడ్ ఎంట్రీని అనౌన్స్ చేసి అందరి ఆశ్చర్యపరిచాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఇటీవలే విడుదలై మంచి అంచనాలు క్రియేట్ చేయగలిగింది. టీజర్ రిలీజ్ కి ముందువరకు ఎలాంటి అంచనాలు లేకపోవటం అటుంచితే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఉండేవి. అయితే ఒక్క టీజర్ తోనే ఈ సినిమాపై హైప్ బాగానే క్రియేట్ అయ్యింది. అసలు ఊసే లేని ఈ సినిమాకు టీజర్ తో మంచి బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయని  టాక్ వినిపిస్తుంది.

వచ్చే నెలలో హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. టీజర్ చూస్తే ప్రభాస్ ఛత్రపతి క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంది అన్న నమ్మకం కలిగిస్తుంది. యాక్షన్ సీన్స్ కు నార్త్ ఆడియెన్స్ కచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే తెలుగు వర్షన్లో లాగా ద్వితీయార్థంలో ఎమోషనల్ కంటెంట్ కొంచెం హెవీగా ఉండటం వల్ల సినిమా స్లో అవ్వకుండా ఎమోషన్స్ లైటర్ వెయిన్ లో ఉంచి సినిమా స్పీడ్ తగ్గకుండా చూసుకుంటే హిందీలో బెల్లంకొండకు బ్లాక్ బస్టర్ దక్కే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు