Shruti Haasan: వరుస హిట్స్ వచ్చినా ఆ హీరోయిన్ కి ప్లస్ అవ్వలేదా..?

శృతి హాసన్, అందం అభినయంతోనే కాకుండా తన వర్సటైల్ టాలెంట్ తో తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్న హీరోయిన్. కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే తన నటనతో అందరిని మెప్పించి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పొందింది ఈ తమిళ భామ. అయితే  ఆఫర్లు లేక కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత గతేడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మెప్పించింది. క్రాక్ తర్వాత వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. పెద్ద హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినప్పటికీ అవి శృతికి పెద్దగా హెల్ప్ అవ్వలేదనే అనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్న శృతి, ది ఐ అనే ఓ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలు మినహా వేరే ఏ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో  సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. శ్రుతికి తెలుగులో అవకాశాలు లేకపోవటానికి కారణం అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వటం, అక్కడికెళ్ళాక టాలీవుడ్ పై దృష్టి పెట్టకపోవటమే అని చెప్పాలి.

ఎన్నో ఆశలతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన శృతి అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత తెలుగులో క్రాక్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న శృతి ప్రభాస్ సరసన సలార్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లతో నటించటమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టటంతో శృతి హాసన్ మళ్ళీ తెలుగులో బిజీ అవుతోంది అనుకున్నారు. కానీ ఆ వరుస హిట్స్ శృతికి పెద్దగా ప్లస్ అవ్వలేకపోయాయి. భారీ అంచనాలతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సలార్ సినిమా అయినా శృతికి ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు