Nagarjuna: కింగ్‌కు అనుష్క ఎక్కడ పడిపోయిందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున – స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి మధ్య స్నేహం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుష్క ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి ఒక్క దర్శకనిర్మాత ఈ బ్యూటీనే ఎంచుకునేవారు. దాదాపు పది సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది అనుష్క. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ కనిపిస్తోంది. అయితే ఇంత వయసు వచ్చినా అనుష్కకి ఇంతవరకు పెళ్లి కాలేదు.
దీంతో ఆమెపై పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క – నాగార్జున కి మధ్య స్నేహం గురించి ఎక్కువగా వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అనుష్కకి నాగార్జునకి మధ్య స్నేహం ఎక్కడ ఏర్పడిందంటే.. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్. ఆమె అక్కినేని నాగచైతన్యకు యోగా టీచర్ గా ఉండేవారు. భూమిక భర్త భరత్ ఠాగూర్ వద్ద అనుష్క యోగా నేర్చుకున్నారు. అయితే చైతన్యకి యోగా నేర్పే క్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను చూసి నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాలో రెండవ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.
ఇక సూపర్ సినిమాలో అనుష్క అందాల ఆరబోతకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత అనుష్క నాగార్జునతో కలిసి చాలా సినిమాలలో నటించింది. డాన్, రగడ, డమరుకం, శ్రీ వెంకటేశాయ నమః వంటి సినిమాలలో నటించి ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క సినిమాలే కాకుండా వ్యాపారాలలో కూడా నాగార్జునతో కలిసి అనుష్క పెట్టుబడులు పెట్టారట. ఇలా ఇవన్నీ ఆమె నాగర్జున మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రధాన కారణం అయ్యాయని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు