Mrunal Thakur: సీత పాత్ర లేకుంటే కెరియర్ ఆగిపోయినట్లేనా.?

మృణాల్ ఠాకూర్ ఈ పేరు చెప్తే కొంతమందికి తెలియకపోవచ్చు.
కానీ సీతారామంలో సీత అంటే తెలియని వారు ఉండరు.
ఎందుకంటే ఆల్మోస్ట్ హిందీ జెర్సీ సినిమాతో తన కెరియర్ అయిపోయింది అనుకున్న తరుణంలో, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా మృణాల ఠాకూర్ కి అద్భుతమైన పేరును తీసుకొచ్చింది. కేవలం అద్భుతమైన పేరు మాత్రమే కాకుండా తెలుగులో అనేక అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం శౌర్య దర్శకత్వంలో నాని నటిస్తున్న “హాయ్ నాన్న” సినిమాలో నాని తసరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ సినిమాతో పాటు పరశురాం పెట్ల దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ మెన్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కూడా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఆల్మోస్ట్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో ఒక సీతారామం అనే హిట్ మృణాల్ కి అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది.

సీతారామం సినిమాలో పద్ధతిగా కనిపించిన మృణాల్ , తన సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారును హాట్ హాట్ పిక్స్ తో పిచ్చెక్కిస్తుంది. మనం చూస్తున్నది ఈ సీత యేనా అనే ఫీలింగ్ చాలామందికి కలిగింది అప్పట్లో. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న టైంలో హీరోయిన్స్ కొరత అనేది కొంతవరకు ఉందనేది వాస్తవం. ఇలానే మంచి ప్రాజెక్టులు చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళితే శ్రీలీలా లా మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తూ కెరియర్ ను ముందుకు నెట్టుకు రావచ్చు.

- Advertisement -

సీతారామం సినిమాకి కూడా అవకాశం ఎలా వచ్చింది అంటే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న “ప్రాజెక్టు కే” చిత్రానికి ముందుగా ఒక రోల్ కోసం మృణాల్ ను అనుకున్నారు. సీతారామం కథ వినగానే ఈ కథకి మృణాల్ సెట్ అవుతుందని, నాగ్ అశ్విన్ చెప్పడంతో, హను కి కూడా అనిపించడంతో సీతారామం అవకాశం దక్కింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు