Mrunal thakur: షాకింగ్ న్యూస్.. రేచీకటితో బాధపడుతున్న సీతారామం బ్యూటీ

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్‌కు ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. అప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. హను రాఘవపూడి, అశ్విని దత్ పుణ్యమా అని సీతారామంలో లక్కీ ఛాన్స్ కొట్టేసి, ఓవర్ నైట్ లో స్టార్ హోదాను కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వరుసగా సినిమా ఛాన్స్ లను దక్కించుకుంటుంది మృణాల్.

ప్రస్తుతం ఈ సీతారామం బ్యూటీ హిందీలో మూడు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ విషయం పక్కన పెడితే, మృణాల్ ఠాకూర్ రేచీకటితో బాధపడుతుందనే వార్త అందరినీ షాక్ కు గురి చేస్తోంది. రేచీకటి ఉండటం వల్ల పెళ్లికి అబ్బాయిలు కూడా ఎవరు ముందుకు రావడం లేదట. దీంతో మృణాల్ తల్లి దండ్రులు వరుడుని వెతికే పనిలో బిజీగా ఉన్నారట. మృణాల్‌కు రేచీకటి ఏంటి? ఆమెకు వరుడు దొరకకపోవడం ఏంటి? అంతా రూమర్స్ అనుకుంటున్నారా?

నిజమేనండి బాబు… అయితే ఇది మృణాల్ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్‌లో. మృణాల్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ‘ఆంఖ్ మిచోలీ’ ఒకటి. బాలీవుడ్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్ల తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 27న రిలీజ్ కాబోయే ఈ సినిమాకు మేకర్స్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మృణాల్ ఠాకూర్ పంచుకుంది.

- Advertisement -

సినిమాలో తనకు రేచీకటి ఉంటుందని, ఈ కారణంతో తన పాత్రకు పెళ్లి కాదని, అందువల్ల తమ తల్లి దండ్రులు చాలా ఇబ్బందులు పడుతారని చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం కామెడీ జానర్ లో ఉంటుందని చెప్పింది. అయితే నిజ జీవితంలో పెళ్లి గురించి ప్రస్తావిస్తే.. తనను భరించే వాడు అసలు ఉన్నాడా? అనేది తన డౌట్ అంటూ నవ్వూతూ ప్రశ్నను దాటేసింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు