Mrunal Thakur: కెజీయఫ్ స్టార్ యష్ తో మృణాల్ ఠాకూర్ ?

Mrunal Thakur

అందరు హీరోయిన్స్ అదృష్టం చుట్టూ తిరుగుతుంటే.. అదృష్టం మాత్రం మృణాల్ ఠాకూర్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది ఆమె కెరీర్ చూస్తుంటే! పనికి రానివి పది సినిమాలు ఎన్ని చేసినా కానీ సరైన ఒక్క సినిమాతో పోటీ రావని మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రూవ్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. కానీ ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మృణాల్ ఠాకూర్ డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. వరుస సినిమా ఆఫర్స్ తో సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

గతేడాది వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమా రిలీజై సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ హీరోయిన్ నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు మరియు ఫిలిం మేకర్స్ మాత్రం ఇప్పటికి కూడా మృణాల్ ఠాకూర్ నామస్మరణ చేస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగులో మృణాల్ ఠాకూర్ నాని తో హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవబోతుంది.

ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ తో ఒక సినిమా కమిట్ అయింది మృణాల్. అలాగే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మృణాల్ ఠాకూర్ చిరంజీవి రాబోయే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించబోతుంది. అలాగే ఎప్పుడెప్పుడాఅని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న కెజీయఫ్ స్టార్ యష్ రాబోయే సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ నటించబోతుందట. దీన్నిబట్టి చూస్తే ముందుగా మనం మాట్లాడుకునట్టుగానే అదృష్టం మృణాల్ ఠాకూర్ చుట్టూనే తిరుగుతుందని చెప్పవచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు