Mrunal Thakur: సీతకి క్రేజీ ఆఫర్ – యాక్సెప్ట్ చేస్తుందా..?

Mrunal Thakur

సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియెన్స్ గుండెల్లో సెటిల్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తున్న మృణాల్ మరో క్రేజీ ఆఫర్ సాధించిందని టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో రూపొందనున్న సోషియో ఫాంటసీ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి మృణాల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించిన వశిష్ఠ ఈ మేరకు చిరు వద్ద ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వశిష్ఠ వినిపించిన లైన్ కి ఇంప్రెస్ అయిన మెగాస్టార్, ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు వశిష్ఠ. ఇటీవల మెగాస్టార్ కి భోళాశంకర్ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది.

- Advertisement -

అయితే, తెలుగులో ఇప్పటిదాకా యంగ్ హీరోల సినిమాల్లో మాత్రమే నటించిన మృణాల్ ఠాకూర్, చిరంజీవి లాంటి సీనియర్ సరసన నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సీతారామం సినిమా ద్వారా తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్ చిరు సరసన నటించి మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు