Tamannaah: ఛాలెంజింగ్ రోల్ లో మిల్కీ బ్యూటీ – పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ..!

Tamannaah

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభం నుండి కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితం అయ్యింది. గ్లామర్ తో, డ్యాన్స్ తోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చింది. అయితే, ఇటీవల అవకాశాలు తగ్గిన నేపథ్యంలో జీ ఖర్దా, లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ తర్వాత చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా ఘోర డిజాస్టర్ అవ్వటంతో ఎలాంటి ఉపయోగం లేకపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ క్లిక్ అయ్యి, సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, సినిమాలో ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ కావటంతో అమ్మడికి గుర్తింపు రాలేదు.

ఇక తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం తమన్నా ఓ పాన్ ఇండియా సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో నటించబోతోందని తెలుస్తోంది. మలయాళంలో దిలీప్ హీరో రూపొందుతున్న బాంద్రా అనే సినిమాలో తమన్నా 90ల కాలంలో ఓ వెలుగు వెలిగి అనుమానాస్పద రీతిలో మరణించిన హీరోయిన్ దివ్య భారతి క్యారెక్టర్లో నటించబోతోందని సమాచారం అందుతోంది.

- Advertisement -

దివ్య భారతి అంటే ఇప్పటి జెనరేషన్ యూత్ కి తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తెలుగులో బొబ్బిలి రాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ వంటి పలు హిట్ సినిమాల్లో నటించిన దివ్యభారతి ముంబైలో తన అపార్ట్మెంట్ పై నుండి అనుమానాస్పద రీతిలో కింద పడి చనిపోయింది.

ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీ గానే ఉండిపోయింది. భర్త ప్రమేయం పై అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. బాంద్రా సినిమాలో డైరెక్ట్ గా దివ్యభారతి పేరు ప్రస్తావన ఉండకపోయినా తమన్నా యాక్ట్ చేసేది ఆమె కారెక్టర్లోనే అని తెలుస్తోంది. మరి, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ తమన్నా కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు