Allu Arjun: అట్లీ తో అల్లు అర్జున్- తొందర్లోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు తొందర్లోనే అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేయడడానికి సిద్ధమవుతున్నడని టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ తో సీరియల్ గా మూడు బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన అట్లీ.. లేటెస్ట్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తరువాత అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడట.

సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప 2 సినిమా తరువాత అల్లు అర్జున్ అటు త్రివిక్రమ్ సినిమాతో పాటు అట్లీ తోను ఒకే సమయంలో సినిమాలు చేయబోతున్నాడట. ఇక అట్లీ – అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయని టాక్. జవాన్ సినిమా రిలీజ్ ముందే అల్లు అర్జున్ అట్లీ ల సినిమా ఎనౌన్స్ మెంట్ ఉండాల్సిందట కానీ జవాన్ రిలీజ్ కు ముందే ఎనౌన్స్ చేయడం మంచిది కాదని భావించిన మేకర్స్ గత కొద్దీ రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ ను వాయిదా వేస్తూ వస్తున్నారట. ఇక జవాన్ సినిమా రేపే రిలీజ్ అవబోతుండటంతో త్వరలోనే అట్లీ , అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు బజ్ వినిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు