Ram Gopal Varma: ఆ పాన్ ఇండియా సినిమాలో రామ్ గోపాల్ వర్మ స్పెషల్ రోల్

Ram Gopal Varma

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కొన్ని హఠాత్పరినామాలు జరగటం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే జరిగిన ఒక వింత పరిణామమే రామ్ గోపాల్ వర్మ యాక్టింగ్ చేయడం అని చెప్పవచ్చు. అయిన రామ్ గోపాల్ వర్మ నటించడంలో వింతమేంది గతంలో కూడా ఒకటి, రెండు సినిమాలలో కనబడి కనబడనట్టుగా రామ్ గోపాల్ వర్మ కనిపించాడు కదా అని అనుకోవచ్చు.. కానీ ఈసారి రామ్ గోపాల్ వర్మ కనిపించబోయేది మాత్రం ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ పాన్ ఇండియన్ ఈ సినిమా ఏంటి ? ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ రోల్ ఏంటి అని డౌట్ వస్తుంది కదా వివరాల్లోకి వెళ్తే..

రామ్ గోపాల్ వర్మ నటించబోయే ఆ భారీ బడ్జెట్ సినిమా మరేదో కాదు ప్రభాస్ నటిస్తోన్న కల్కి సినిమా. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సూపర్ హీరో కాసెప్ట్ తో ఇండియన్ మిథాలజీ లోని ఆసక్తికర అంశాలకు ఫిక్షన్ ను జోడించి తీస్తున్న ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ ప్రొఫెసర్ రోల్ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కనిపించబోతున్నారట, ఈ రోల్ కోసం గాను ఆయన కొత్తగా మేకోవర్ కూడా చేశారట మూవీ యూనిట్. త్వరలోనే ఆయన కల్కి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి ఇదే గనక నిజమైతే కల్కి సినిమా పబ్లిసిటీ ఖర్చులు అశ్విని దత్ కు కొంతవరకు మిగిలినట్టే అని చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు