Bigg Boss season 7: పల్లవి ప్రశాంత్ వర్సెస్ హీరో శివాజీ – రైతు బిడ్డ మామూలోడు కాదు..

Bigg Boss season 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో తన సత్తా చూపించడానికి రెడీ అయ్యాడనిపిస్తోంది. నిజానికి బిగ్ హౌస్ లోకి ఎవరు రావాలనేది సాధారణంగా బిగ్ బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేస్తుంది. కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో అలా జరగలేదు, తానే కావాలని యూట్యూబ్ లో తనని బిగ్ బాస్ కు పంపించాలని వీడియోస్ చేసి, పాపులర్ అయ్యాడు. అంతేకాదు తన వీడియోస్ తో ఏకంగా బిగ్ బాస్ టీం దృష్టిని ఆకర్షించి, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యి ,కంటిస్టెంట్ గా కొనసాగుతున్నాడు.

ఇక పల్లవి ప్రశాంత్ ఆట విషయానికొస్తే.. మొదటి రోజంతా ప్రశాంత్ హౌస్ లోకి వచ్చిన ఎగ్జైట్ మెంట్ లోనే అయిపొయింది. ఇక రెండవ రోజు నామినేషన్ గొడవలతో, మనస్పర్థలతో ప్రశాంత్ అప్పియరెన్స్ పెద్దగా కనిపించలేదు. ఇక మూడవ రోజు నుంచి బిగ్ బాస్ లో టాస్క్ లు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. దాంతో కంటిస్టెంట్స్ అంత కూడా తమ అసలు ఆట ఆడటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

కాసేపటి క్రితంమే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్ ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ లోకు కంటిస్టెంట్స్ అడుగుపెట్టిన తరువాత వచ్చిన మొదటి టాస్క్ అవడంతో ఎవరికీ వారు వాళ్ళ వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి పోటీలో పాల్గొనట్టే ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది

- Advertisement -

అయితే బిగ్ బాస్ పెట్టిన మొదటి టాస్క్ మరేదో కాదు కుస్తీ పోటీ టాస్క్ . అయితే ఈ టాస్క్ ను బట్టి చూస్తే హౌస్ లో ఉన్న మెల్ కంటిస్టెంట్స్ కు ఈ టాస్క్ అడ్వాంటేజ్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ టాస్క్ నిజానికి ఫీజికల్ టాస్క్ అవడంతో అందరు ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే బాడీ బిల్డర్ యావర్ గాని లేక శివాజీ, గౌతమ్ లు గాని సత్తా చుపిస్తారనుకుంటే బక్క పలచని పల్లవి ప్రశాంత్ కుస్తీ పోటీలలో తన సత్తా చూపించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రశాంత్ ఆటకు హీరో శివాజీ ఆశ్చర్య పోయి ప్రశాంత్ మామూలోడు కాదు.. చాలా స్ట్రాంగ్ కంటిస్టెంట్ అని అనడంతో ఈరోజు ఎపిసోడ్ లో ప్రశాంత్ రైతు బిడ్డ కండ బలం తో పాటు బుద్ది బలం చూపించినట్టు అర్థమవుతోంది. మరీ రైతు బిడ్డ ప్రశాంత్ ఈరోజు ఎపిసోడ్ లో ఎంతవరకు విజృంభించాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు