Pooja Hegde New Movie: ఇదే చివరి అవకాశం… కెరీర్ నిలబెట్టుకుంటుందా?

బుట్ట బొమ్మ పూజా హెగ్డే శుక్రవారం తన 33వ బర్త్ డేని మాల్దీవులలో చాలా గ్రాండ్ గా జరుపుకుంది. తన భాయ్ ఫ్రెండ్‌తో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుందని గాసిప్స్ వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, పూజా తన అభిమానులకు బర్త్ డే సందర్భంగా ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. తాను నటించే తర్వాత సినిమా గురించి శుక్రవారం అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ముగిసిపోయింది అని అనుకునే సమయంలో పూజా తర్వాత సినిమా అనౌన్స్ మెంట్ రావడం తన అభిమానులకు ఊపిరి పీల్చుకున్నంత పని అయింది.

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దీనిపై శుక్రవారమే అధికారిక ప్రకటన వచ్చింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం… ఒక యంగ్ పోలీష్ ఆఫీసర్ ఒక కేసు విషయంలో ఎదుర్కొన్న సవాళ్ల చుట్టు ఉంటుందట. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఉండే ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ నిర్మిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, పూజా హెగ్డేకు ఇక్కడే అసలైన సవాల్ ఉంది.

ఇప్పటి వరకు లవ్ స్టోరీ బేస్డ్ సినిమాల్లోనే కనిపించిన పూజా హెగ్డేను ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఒక వేళ ఆడియన్స్ ఒప్పుకున్నా… పూజాకు యాక్షన్ సీన్స్ లో నటించే సత్తా ఉందా ? అనేది ప్రశ్న. అయితే గత కొన్ని రోజుల నుంచి పూజా మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్‌ ట్రైనింగ్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అది ఈ సినిమా కోసమే అని ఇప్పుడు అర్థమవుతుంది.

- Advertisement -

ఏది ఏమైనా, పూజా ఇప్పుడు ఈ సినిమాతో అయినా నిరూపించుకోవాలి. అలా కాకుండా, పూజా నుంచి ఇప్పటి వరకు వచ్చిన 5 సినిమాల్లా ఇది కూడా డిజాస్టార్ అయితే, ఇక ఇండస్ట్రీ నుంచి తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు