Chinna: పదేళ్ల తర్వాత సమంతకు సిద్ధార్థ్ ఫోన్.. అభిమానులకు కొత్త డౌట్లు..!

 

స్టార్ హీరోయిన్ సమంత – అక్కినేని నాగచైతన్య చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగిన పథకాలానికి వీరిద్దరూ విడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారన్న జవాబు తెలియక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ మల్లి కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ అదంతా అబద్ధమని సమంత చైతన్య కోసం వెయించుకున్న టాటూ ని సైతం తీసేసిందని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

అయితే ఇప్పుడు సమంత మళ్ళీ తన పాత బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తో చేతులు కలిపిందనే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. చైతుతో ప్రేమ, పెళ్ళికి ముందే సమంత హీరో సిద్దార్థ్ తో ప్రేమాయణం నడిపిందనే టాక్ ఉంది. ఒకానొక సమయంలో వీరిద్దరూ తమకి ఉన్న దోషాలను తొలగించుకోవడానికి శ్రీకాళహస్తికి వెళ్లి దోష పూజలు కూడా చేయించుకున్నారని ప్రచారం జరిగింది. అయితే సమంత – చైతు ప్రేమ పెళ్లి తర్వాత సిద్ధార్థ్ విషయాన్ని అందరూ పక్కన పెట్టేశారు.

- Advertisement -

అయితే తాజాగా సిద్ధార్థ్ నటించిన చిన్నా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే సమంత సైతం ఈ సినిమాలో సిద్ధార్థ్ నటన చూసి డైరెక్టర్ అరుణ్ కుమార్ కి కాల్ చేసి మరి పొగిడేసిందట. అంతేకాదు సిద్ధార్థ్ నటన ఈ సినిమాకి ఎంతగానో ప్లస్ అయిందని చెప్పుకొచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఏకంగా 10 సంవత్సరాల తర్వాత మళ్లీ సమంతకు కాల్ చేసి మాట్లాడారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో వీరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించిందా.? అంటూ చర్చించుకుంటున్నారు నెటిజెన్లు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు