LEO Movie: విజయ్‌కి బ్యాడ్ లక్… అన్ని ఎదురుదెబ్బలే !

లియో… ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన నాటి నుంచి అందరిలో ఏదో తెలియని హైప్. ఇది విజయ్ దళపతి వల్ల వచ్చింది కాదు. యంగ్ సెన్సెషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వల్ల ఈ హైప్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే లియో మూవీపై హైప్ క్రమంగా తగ్గుతూ వస్తుంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. దీనికి ఒక్క కారణం కాదు. చాలా ఉన్నాయి. సూపర్ స్టార్ ట్యాగ్ విషయంలో రజినీ కాంత్ ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ విజయ్ సినిమాను ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే అజిత్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.

దీనికి తోడు వేరే వాళ్లు ట్రోల్ చేయడం ఎందుకు మనకు మనమే ట్రోల్ చేసుకోవాలి అన్నట్టు… ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు.. ట్రైలర్.. ట్రోలర్స్‌కి మేకర్సే స్టఫ్ ఇచ్చినట్టు అయింది. అలాగే తమిళనాడులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. జైలర్ మూవీ ఆడియో లాంచ్ లా అనిరుధ్ తో లైవ్ ఫర్మామెన్స్ ఇచ్చి, బజ్ క్రియేట్ చేయాలని అనుకున్నారు. కానీ, విజయ్ – తమిళనాడు ప్రభుత్వం మధ్య ఉన్న గొడవల వల్ల అది కాస్త క్యాన్సిల్ అయింది. దీంతో సినిమాపై హైప్ పెంచే ఒకగాను ఒక్క అవకాశం చేజారిపోయింది. అంతే కాకుండా ఫ్యాన్స్‌‌లో నిరాశ.

అలాగే తెలుగు ప్రమోషన్స్‌కు ఎప్పుడూ దూరం ఉండే విజయ్, ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉంటున్నాడు. “తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చే కలెక్షన్లు కావాలి.. కానీ, తెలుగు ఆడియన్స్‌ను సినిమా చూడాలి అని అడగడం రాదా…” అంటూ విజయ్‌పై తెలుగు సినీ లవర్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు శుక్రవారం సినిమా నుంచి రిలీజైన నే రేడీ… సాంగ్ ఏ మాత్రం గ్రిప్పింగ్‌గా లేదు. ఏదో తెలుగు వెర్షన్ ఉండాలి కదా.. అనే ఉద్దేశ్యంతో చేశారంతే కానీ, స్పెషల్ కేర్ తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఇది లియో తెలుగు వెర్షన్‌కి పెద్ద మైనస్.

- Advertisement -

ఇక తాజాగా లియో సినిమాకు తమిళనాడు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. లియో బెనిఫిట్ షోలకు అనుమతులు నిరాకరించింది. ప్రభుత్వం ముందుగా ఇచ్చిన జీవో ప్రకారం… ఉదయం 4 గంటల వరకు షోలు ఉండవు. అయితే 5 గంటల తర్వాత అయినా షోలు ఉంటాయని అనుకున్నారు. కానీ, తమిళనాడు ప్రభుత్వం ఏకంగా 9 గంటల వరకు బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు అని స్పష్టం చేసింది. అంటే… విజయ్ సినిమా తమిళనాడు కంటే ముందుగానే ఇతర భాషల్లో, ఇతర రాష్ట్రాల్లో విడుదల అవుతాయి. ఇది తమిళ బయ్యర్లకు పెద్ద ఎదురుదెబ్బ.

లియో సినిమాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే… అది రామ్ చరణ్ క్యామియో రోల్ అంటూ వచ్చిన గాసిప్ మాత్రమే. సినిమాలో రామ్ చరణ్ ఉంటే, ఊహించిన రిజెల్ట్ ఉంటుంది. ఒక వేళ రామ్ చరణ్ న్యూస్… నిజంగానే గాసిప్ అయితే మాత్రం మేకర్స్‌కు గట్టి దెబ్బే తగులుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు